నాకు అబ్బాయిని కాదు.. అమ్మాయిని చూడండి.. పెళ్లి సంబంధాలు చూస్తున్న తల్లిదండ్రులకు అసలు నిజం చెప్పిన కూతురు..!

ABN , First Publish Date - 2021-12-04T19:17:39+05:30 IST

నాకు ఎనిమిదేళ్ల వయసు ఉన్నప్పుడు ఒక పెళ్లికి వెళ్లాం. పెళ్లికి వెళుతున్నామని మా అమ్మ నాకు బలవంతంగా గౌను తొడిగింది.

నాకు అబ్బాయిని కాదు.. అమ్మాయిని చూడండి.. పెళ్లి సంబంధాలు చూస్తున్న తల్లిదండ్రులకు అసలు నిజం చెప్పిన కూతురు..!

`నాకు ఎనిమిదేళ్ల వయసు ఉన్నప్పుడు ఒక పెళ్లికి వెళ్లాం. పెళ్లికి వెళుతున్నామని మా అమ్మ నాకు బలవంతంగా గౌను తొడిగింది. నాకు గౌను వేసినందుకు ఆ రాత్రంతా ఏడుస్తూనే ఉన్నాను. భోజనం కూడా చేయలేదు. అప్పుడర్థమైంది నా కుటుంబానికి నేను సాధారణ అమ్మాయిని కాదని. కానీ, వాళ్లు నన్ను సీరియస్‌గా తీసుకోలేదు. నా శరీరం అమ్మాయిలాగానే ఉంటుంది. కానీ, ఫీలింగ్స్ అన్నీ అబ్బాయివి. అందుకే లింగమార్పిడి చికిత్సకు సిద్ధమవుతున్నా`.. ఇటీవల ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నుంచి లింగమార్పిడికి అనుమతి పొందిన పోలీస్ కానిస్టేబుల్ వ్యాఖ్యాలివి. 


తాను అమ్మాయి నుంచి అబ్బాయిగా మారాలనుకుంటున్నానని, అందుకు అనుమతి కావాలని కోరుతూ ఆమె 2019లో ఉత్తరప్రదేశ్‌ హోంశాఖకు లేఖ రాసింది. తాజాగా ఆమెకు ప్రభుత్వం నుంచి అనుమతి లభించింది. ఈ నేపథ్యంలో ఆమె సంతోషం వ్యక్తం చేసింది. `నా కుటుంబ సభ్యులు నా ప్రవర్తనను జీర్ణించుకోలేకపోయారు. నాకు పెళ్లి సంబంధాలు చూడడం మొదలుపెట్టారు. నాకు అబ్బాయిని కాదు.. అమ్మాయిని చూడండని చెప్పాను. వారు ఒప్పుకోకపోవడంతో ఇంటి నుంచి బయటకు వచ్చేశాను. నాలుగేళ్ల క్రితం ఒకమ్మాయితో డేటింగ్ చేశాను. ఇప్పుడామెకు పెళ్లి అయిపోయింది. 


నా శరీరం పూర్తిగా అమ్మాయిలాగానే ఉంటుంది. ప్రతి నెలా పీరియడ్స్ వస్తాయి. అయితే ఫీలింగ్స్ మాత్రం అబ్బాయి తరహాలో ఉంటాయి. అందుకే శస్త్రచికిత్సకు సిద్ధమవుతున్నా. పూర్తి మగాడిలా నా శరీరాన్ని మార్చుకోవాలనుకుంటున్నా. ఈ సర్జరీ మూడు దశల్లో జరుగుతుంది. ముందు ఢిల్లీలో బ్రెస్ట్ సర్జరీ, థాయ్‌లాండ్‌లో బాటమ్ సర్జరీ చేయించుకోవాలి. మొత్తం రూ.8 లక్షలు ఖర్చువుతుంది. ప్రస్తుతానికి రూ.5 లక్షలున్నాయి. మిగిలిన డబ్బు ఏర్పాటు చేసుకోవాలి. సర్జరీ తర్వాత మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాన`ని ఆమె తెలిపింది. 

Updated Date - 2021-12-04T19:17:39+05:30 IST