కొల్లేటికే... కష్టం వచ్చే..

ABN , First Publish Date - 2020-11-28T05:44:10+05:30 IST

కొల్లేరు మంచినీటి సరస్సును పరిరక్షించుకోవాలంటే అభయారణ్యాన్ని అభివృద్ధి చేయాలి. ఉప్పుటేరు ఎగదన్నకుండా చర్యలు తీసుకోవాలి. రొయ్యల చెరువుల నీరు సరస్సులోకి చేరకుండా ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలి. అది జరగాలంటే అభయారణ్యం అభివృద్ధి ఒక్కటే శరణ్యం.

కొల్లేటికే... కష్టం వచ్చే..


రూ.180 కోట్లతో పర్యాటక  ప్రతిపాదన

నివేదిక సమర్పించినా స్పందించని కేంద్రం

గతంలోనూ రూ.250 కోట్లతో అభివృద్ధికి ప్రయత్నం

ప్రాజెక్ట్‌ అభివృద్ధికి అడ్డంకులెన్నో 

కొల్లేరు మంచినీటి సరస్సును పరిరక్షించుకోవాలంటే అభయారణ్యాన్ని అభివృద్ధి చేయాలి. ఉప్పుటేరు ఎగదన్నకుండా చర్యలు తీసుకోవాలి. రొయ్యల చెరువుల నీరు సరస్సులోకి చేరకుండా ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలి. అది జరగాలంటే అభయారణ్యం అభివృద్ధి ఒక్కటే శరణ్యం. దీనిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దోబూచులాడుతున్నాయి. నిధుల కోసం కేంద్రంపై రాష్ట్రం ఆధారపడుతోంది. కేంద్రం నిధులు ఇవ్వకుండా తాత్సారం చేస్తోంది. రాష్ట్రమైనా నిధులు కేటాయించే ప్రయత్నం చేయడం లేదు. 

(తాడేపల్లిగూడెం–ఆంధ్రజ్యోతి)

కొల్లేటి సరస్సును పర్యాటకంగా అభివృద్ధి చేయాల న్న ప్రభుత్వ లక్ష్యానికి నిధుల లేమి అడ్డంకిగా మారిం ది. కేంద్రం నుంచి స్పందన లేకపోవడంతో ఈ సరస్సు అందాలు మరింతగా ఇనుమడించడం లేదు. 2005లో సరస్సు ప్రక్షాళన తర్వాత కొల్లేటి అభయారణ్యాన్ని ఐదో కాంటూరుకు పరిమితం చేశారు. దీనిని మూడో కాం టూరుకు కుదించి పర్యాటకంగా సరస్సును అభివృద్ధి చేయాలని గత ప్రభుత్వం తలపోసింది. అప్పట్లో రూ. 250 కోట్లతో అభివృద్ధి చేయాలని ప్రణాళిక తయారు చేసింది. అయినా ప్రభుత్వ ఆశయం సాధ్యం కాలేదు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఉత్తరాంధ్ర జిల్లాలతోపాటు, ఉభయ గోదావరి జిల్లాల్లో రూ.వెయ్యి కోట్లు వెచ్చించి ఆలయాలతోపాటు కొల్లేటి సరస్సును అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరుచేసేలా ప్రతిపాదనలు పంపారు. ఇప్పటి వరకు కేంద్రం నుంచి ఎటువంటి స్పందనలే దు. దీంతో కొల్లేటి అభివృద్ధి కలగానే మిగిలిపోతోంది. అభయారణ్యాన్ని అభివృద్ధి చేస్తే పర్యాటకంతోపాటు, సరస్సు పరివాహక ప్రాంతాల్లో వరద నివారణ సాధ్య మవుతుంది.ఆ దిశగా ప్రభుత్వాలు అడుగులు వేయాలి. 


కాంటూరు కుదింపుపైనా అనుమానాలు

గత ప్రభుత్వ హయాం నుంచి కొల్లేరు కాంటూరు కుదిస్తారని, ఆ తర్వాత అభయారణ్యాన్ని అభివృద్ధి చేస్తారంటూ రైతులు, కొల్లేటి వాసులు ఆకాంక్షిస్తు న్నారు. గత ప్రభుత్వం ఆ దిశగా తీర్మానం చేసి కేంద్రా నికి పంపింది. న్యాయపరమైన చిక్కులతో కొల్లేరు సరస్సు కుదింపు నిలిచిపోయింది. ప్రస్తుత ప్రభుత్వ హయాంలో కాంటూరు కుదింపునకు ఎటువంటి ప్రయత్నాలు సాగడం లేదు. ప్రస్తుతం ఐదో కాంటూరు వరకు కొల్లేరు అభయారణ్యం విస్తరించి ఉంది. దాదాపు 50 వేల ఎకరాల్లో సరస్సు విస్తీర్ణం ఉంది. మూడో కాంటూరుకు కుదిస్తే 30 వేల ఎకరాలకు తగ్గనుంది. పర్యావరణం, న్యాయపరమైన అవరోధాలు ఉంటాయన్న ఉద్దేశంతో కేంద్ర స్థాయిలో కుదింపుపై పెద్దగా స్పందన రావడం లేదు. మరోవైపు ప్రాజెక్ట్‌ అభి వృద్ధికి నిధులు కేటాయించడం లేదు. ఒకవేళ కొల్లేరు కాంటూరు కుదించకపోతే అభయారణ్యం పరిధిలో జిరాయితీ భూములు సమస్య వెంటాడనుంది. కొల్లేరు 6వ కాంటూరు పరిధిలోవున్న తమ సొంత భూముల్లో రైతులు ఇప్పుడు ఆక్వా సాగు చేస్తున్నారు. అభయార ణ్యాన్ని అభివృద్ధి చేయాలంటే 5వ కాంటూరు పరిధిలో వున్న దాదాపు 6,500 ఎకరాలకు ప్రభుత్వం పరిహారం చెల్లించాల్సి ఉంటుంది. అదే మూడో కాంటూరుకు కుది స్తే పెద్దగా పరిహారం అందచేయాల్సిన అవసరం లేదు. మొత్తం కొల్లేరు సరస్సుకు చెందిన భూములే ఉంటాయి. కుదింపు మాటెలా ఉన్నా ప్రాజెక్ట్‌ అభివృద్ధి మాత్రం అడుగు ముందుకు వేయడం లేదు. దీంతో కొల్లేరు సరస్సు కాస్త ఉప్పు నీటి సరస్సుగా మారుతుం ది. ఓ వైపు కొల్లేరు ఎగువ భాగంలో రొయ్య చెరువులు సాగు చేస్తున్నారు. 

మరోవైపు కింది భాగం నుంచి ఉప్పుటేరు ఎగదన్ను తోంది. రెండు వైపుల నుంచి కొల్లేటిలోకి ఉప్పు నీరు వచ్చి పడుతోంది. దీంతో మంచినీటి సరస్సు కాస్త ఉప్పు నీటి సరస్సుగా మారిపోతోందన్న ఆందోళన పర్యావరణ వేత్తల్లో వ్యక్తమవుతోంది. కొల్లేరు సరస్సును అభయారణ్యంగా అభివృద్ధి చేసి పర్యాటక క్షేత్రంగా తీర్చిదిద్దాలన్న ప్రజాకాంక్ష నెరవేరే పరిస్థితి కనిపించడం లేదు.  

 

Updated Date - 2020-11-28T05:44:10+05:30 IST