విదేశీ విద్యకు మంగళం..!

ABN , First Publish Date - 2020-11-28T05:49:37+05:30 IST

విదేశాలకు వెళ్లి చదువుకోవాలనే సామాన్యుల కలను నిజం చేసే ‘విదేశీ విద్యాదరణ పథకాని’కి వైసీపీ ప్రభుత్వం స్వస్తి చెప్పిందా..? అంటే అవుననే అనిపి స్తోంది.

విదేశీ విద్యకు మంగళం..!

ఏడాదిన్నరగా నిలిచిపోయిన పథకం.. ఓపెన్‌ కాని వెబ్‌సైట్‌

ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, కాపు విద్యార్థుల ఎదురుచూపులు

విదేశాలకు వెళ్లిన వారికీ ఆగిన సాయం

(ఏలూరు–ఆంధ్రజ్యోతి):

విదేశాలకు వెళ్లి చదువుకోవాలనే సామాన్యుల కలను నిజం చేసే ‘విదేశీ విద్యాదరణ పథకాని’కి వైసీపీ ప్రభుత్వం స్వస్తి చెప్పిందా..? అంటే అవుననే అనిపి స్తోంది. 2016 నుంచి 2019 వరకూ కొనసాగిన ఈ పథకంపై ఏడాదిన్నరగా ఊసే లేదు. గడిచిన 16 నెలల్లో జిల్లా నుంచి ఒక్కరికి కూడా విదే శాల్లో చదువుకునే అవకాశం లభించలే దు. విదేశాలకు వెళ్లిన వారికీ సాయం అందడం లేదు. ఈ పథకాన్ని ఆపేసి నట్లు ప్రభుత్వం అధికారికంగా ప్రక టించనప్పటికీ ఆచరణలో పత్తా లేక పోయింది. విదేశాల్లో ఉన్నత చదువుల కోసం జిల్లా నుంచి ఏటా వేలాది మంది వెళుతుంటారు. డబ్బున్న వారు నేరుగా వెళుతుంటే.. సామాన్యులకు ప్రభుత్వ సాయం తీసు కుంటారు. ఇందుకు గత ప్రభుత్వం అంబేడ్కర్‌ ఓవ ర్సీస్‌ విదేశీ విద్యాదీవెన ద్వారా ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు, ఎన్‌టీఆర్‌ విదేశీ విద్యాదరణ పేర బీసీ, ఈబీసీ విద్యా ర్థులకు విదేశాల్లో చదువుల కోసం రూ.10 లక్షల మేర ఉపకార వేతనం అందించేది. దీంతో జిల్లాలో చాలా మంది విదేశాలకు వెళ్లి చదువుకునే అవకాశం పొందారు. సాంఘిక సంక్షే మ శాఖ ద్వారా 17 మంది, బీసీ సంక్షేమం నుంచి 95 మంది, ఈబీసీ ద్వారా 14 మంది విద్యార్థులు గత ప్రభుత్వ హయాంలో విదేశీ చదువు లకు వెళ్లారు. కాపు కార్పొరేషన్‌ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా మరో 400 మంది విదేశీ చదువులకు అవకాశం పొం దారు. వీరిలో చాలా మందికి అప్పటి ప్రభుత్వం ప్రక టించిన పూర్తిసాయం రూ.10 లక్షలూ అందజేసింది. చివరి ఏడాది 2018–19, 2019–20 ఆర్థిక సంవత్సరంలో అర్హత పొందిన చాలామందికి సాయం నిలిచిపోయింది. 


30 మందికి నిలిచిన సాయం

ప్రభుత్వం అందించే సాయంపై ఆధారపడి విదేశీ చదువులకు వెళ్లిన దాదాపు 30 మంది విద్యార్థులకు ఏడాదిన్నరగా సాయం ఆగిపోయింది. ఎంపికైన సంద ర్భంలో విదేశాలకు వెళ్లడానికి, అడ్మిషన్లు పొందడానికి చెల్లించే రూ.5 లక్షలు మాత్రమే వారికి అందాయి. ఆ తరువాత చెల్లించాల్సిన మలివిడత సాయం అందలేదు. బీసీ కార్పొరేషన్‌ పరిధిలో 21 మంది, ఈబీసీ పరిధిలో ఆరుగురికి ఇప్పటి వరకూ సాయం అందలేదు. విదేశా ల్లో ఉన్న వారి భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. 

విదేశీ విద్యాదరణ పథకంపై ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాచారం లేదని బీసీ సంక్షేమ అధికారి ఏవీఎన్‌ కృష్ణారావు చెప్పారు. ప్రస్తుతం వెబ్‌సైట్‌ కూడా ఓపెన్‌ కావడం 
లేదన్నారు. 

Updated Date - 2020-11-28T05:49:37+05:30 IST