హైదరాబాద్: వింతగా ప్రవర్తిస్తున్న మందుబాబులు

ABN , First Publish Date - 2020-03-30T19:42:51+05:30 IST

ఎర్రగడ్డ మానసిక ఆస్పత్రికి ఒక్కసారిగా కేసులు పెరిగాయి.

హైదరాబాద్: వింతగా ప్రవర్తిస్తున్న మందుబాబులు

హైదరాబాద్: ఎర్రగడ్డ మానసిక ఆస్పత్రికి ఒక్కసారిగా కేసులు పెరిగాయి. కొందరు మందుబాబులు మద్యం లేక పోవడంతో పిచ్చిగా వ్యవహరిస్తున్నారు. కొందరు వ్యక్తిగతంగా ఇంజుర్ చేసుకుంటున్నారు. సోమవారం ఓపీకి 100కు పైగా బాధితులు వచ్చారు. మందు దొరకక మందుబాబులు వింతగా ప్రవర్తిస్తున్నారు.


ఈ సందర్భంగా ఎర్రగడ్ద మానసిక వైద్యశాల సూపరిండెంట్ డాక్టర్ ఉమా శంకర్ మాట్లాడుతూ గత రెండు రోజులుగా హాస్పిటల్‌కి భారీగా ఓపీ కేసులు నమోదవుతున్నాయన్నారు. మొన్నటి వరకు రోజుకు 30-40 రోగులు వస్తే.. అందులో 4 వరకు మద్యం కేసులు ఉండేవని,  కానీ ఇవాళ ఒక్కరోజే 100  ఓపి కేసులు మద్యానికి సంబంధించినవి వచ్చాయన్నారు. వారందరికీ చికిత్స అందిస్తున్నామని, అవసరమైన వారికి ఇక్కడే అడ్మిట్ చేసుకొని మిగిలిన వారిని పంపిస్తున్నామని చెప్పారు. ప్రతిరోజు మద్యం, కళ్ళు తాగడం వల్ల ఒక్కసారిగా తాగడానికి దొరకకపోవడంతో  వారి ప్రవర్తన వింతగా మారిందన్నారు. ఎక్కువగా క్లోరోఫామ్, డైజోఫామ్ వాడడం వల్ల ఇలా ప్రవర్తిస్తున్నారని, మందు దొరకకపోవడం వల్ల ఇది వారిలో 24 గంటల్లో వారిపై ప్రభావం చూపుతుందని డాక్టర్ ఉమా శంకర్ పేర్కొన్నారు.

Updated Date - 2020-03-30T19:42:51+05:30 IST