7 నెలల క్రితం పెళ్లి.. టీ చేస్తూ మీ అమ్మాయి చనిపోయిందంటూ అల్లుడి నుంచి ఫోన్.. అంత్యక్రియలు చేస్తుండగా..

ABN , First Publish Date - 2021-09-19T01:29:00+05:30 IST

పెళ్లి చేసుకుని.. సంతోషంగా అత్తారింట్లో అడుగుపెట్టిన ఓ మహిళ 7 నెలల్లోనే శవమై శ్మశానానికి చేరింది. దీంతో కన్నబిడ్డను పోగొట్టుకున్న ఆ తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. అల్లారు ముద్దుగా పెంచుకున్న తమ బిడ్డ ఇక లేదనే బాధలో.. పుట్టెడు దు:ఖంతోనే అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. కొద్ది సేపట్లో దహన సంస్కారాలు జరుగుతాయనగా.. కూతురి శవంపై ఉన్న గాయా

7 నెలల క్రితం పెళ్లి.. టీ చేస్తూ మీ అమ్మాయి చనిపోయిందంటూ అల్లుడి నుంచి ఫోన్.. అంత్యక్రియలు చేస్తుండగా..

ఇంటర్నెట్ డెస్క్: పెళ్లి చేసుకుని.. సంతోషంగా అత్తారింట్లో అడుగుపెట్టిన ఓ మహిళ 7 నెలల్లోనే శవమై శ్మశానానికి చేరింది. దీంతో కన్నబిడ్డను పోగొట్టుకున్న ఆ తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. అల్లారు ముద్దుగా పెంచుకున్న తమ బిడ్డ ఇక లేదనే బాధలో.. పుట్టెడు దు:ఖంతోనే అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. కొద్ది సేపట్లో దహన సంస్కారాలు జరుగుతాయనగా.. కూతురి శవంపై ఉన్న గాయాలను చూసి, ఆ తల్లిదండ్రులు షాక్ అయ్యారు. అనంతరం అల్లుడిని నిలదీశారు. దీంతో అతను అసలు విషయం బయటపెట్టాడు. పూర్తి వివరాల్లోకి వెళితే..



ఛత్తీస్‌గఢ్‌లోని సింగన్‌పురి గ్రామానికి చెందిన రాహుల్ సాహుకు 7నెలల క్రితం కవర్ద జిల్లా పుసెర గ్రామానికి చెందిన ఆర్తితో వివాహం జరిగింది. అంతా సజావుగా సాగుతున్న వారి దాంపత్య జీవితంలో ఒక్కసారిగా అలజడి చెలరేగింది. అదనపు కట్నం కింద బైక్ కొనివ్వాలని అత్తమామలను డిమాండ్ చేయడం ప్రారంభించాడు. ఈ క్రమంలోనే భార్యను వేధిస్తూ.. తీవ్రంగా హింసించడం మొదలుపెట్టాడు. భర్త పెడుతున్న చిత్ర హింసల గురించి ఆర్తి తన తల్లిదండ్రులకు చెప్పింది. అయితే ఆర్థిక కారణాల వల్ల వారు తమ అల్లుడి బైక్ కొనివ్వలేకపోయారు. రోజులు గడుస్తున్నా.. అత్తామామల నుంచి ఎటువంటి స్పందనా లేకపోవడంతో రాహుల్ మరింత అగ్రహానికి లోనయ్యాడు. ఈ క్రమంలోనే ఓ రోజు తన అత్తామామలకు ఫోన్ చేసిన రాహుల్.. ఓ పిడుగులాంటి వార్త వారి చెవిన వేశాడు.



ఎలక్ట్రిక్ స్టౌపై టీ పెడుతూ.. తన భార్య చనిపోయిందని చెప్పాడు. దీంతో ఆర్తి తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురుకి ఇలా జరగడమేంటని గుండెలవిసేలా విలపించారు. పుట్టెడు ద:ఖంలోనే అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. అయితే కొద్ది సమయంలో దహన సంస్కారాలు జరుగుతాయనగా.. ఆర్తి తల్లిదండ్రులు ఆమె శవంపై ఉన్న గాయాలను గమనించారు. దీంతో అసలేం జరిగిందంటూ అక్కడే ఉన్న అల్లుడిని నిలదీశారు. ఈ క్రమంలో రాహుల్ చెప్పింది విని, వారు ఘెల్లుమన్నారు. బైక్ కొనివ్వకపోవడంతో.. ఆర్తిని తానే కత్తితో గొంతు కోసి చంపేసినట్టు ఒప్పుడకున్నాడు. దీంతో ఆగ్రహానికి లోనైన ఆర్తి కుటుంబ సభ్యలు.. రాహుల్‌ను పోలీసులకు అప్పగించారు. ఈ క్రమంలో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. విచారణ జరపుతున్నారు. 


Updated Date - 2021-09-19T01:29:00+05:30 IST