పచ్చని చెట్ల మధ్య 10 నిమిషాలుంటే ఒత్తిడి దూరం

ABN , First Publish Date - 2020-02-27T08:17:03+05:30 IST

రోజూ ఓ 10 నిమిషాలు ప్రకృతిలో గడపడం వల్ల విద్యార్థుల్లో ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. తద్వారా వారు తమ రంగాల్లో మెరుగైన ఫలితాలు సాధించే అవకాశం

పచ్చని చెట్ల మధ్య 10 నిమిషాలుంటే ఒత్తిడి దూరం

న్యూయార్క్‌, ఫిబ్రవరి 26: రోజూ ఓ 10 నిమిషాలు ప్రకృతిలో గడపడం వల్ల విద్యార్థుల్లో ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. తద్వారా వారు తమ రంగాల్లో మెరుగైన ఫలితాలు సాధించే అవకాశం ఉందన్నారు. తమ పరిశోధనల్లో భాగంగా అమెరికా శాస్త్రవేత్తలు 15-30 సంవత్సరాల వయసున్న కొంత మందిని కొంతసేపు పార్కుల్లో గడిపేలా చూశారు. దీంతో వారిలో అంతకుముందుతో పోల్చితే మానసికంగా సానుకూల మార్పు కనిపించింది.

Updated Date - 2020-02-27T08:17:03+05:30 IST