కరోనా నియంత్రణకు పటిష్టమైన చర్యలు

ABN , First Publish Date - 2021-06-17T07:07:17+05:30 IST

కరోనా నియంత్రణకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని విద్యుత్‌శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి జిల్లా అధికారులను ఆదేశించారు.

కరోనా నియంత్రణకు పటిష్టమైన చర్యలు
అభిరామ్‌కు రూ.10 లక్షల చెక్కును అందజేస్తున్న మంత్రి బాలినేని, కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌

మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి

ఒంగోలు(కలెక్టరేట్‌), జూన్‌ 16: కరోనా నియంత్రణకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని విద్యుత్‌శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి జిల్లా అధికారులను ఆదేశించారు. స్థానిక ఎన్‌ఎస్‌పీ అతిథి గృహంలో బుధవారం కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌, ఎస్పీ సిద్ధార్థ కౌశల్‌తో మంత్రి సమావేశమయ్యారు. జిల్లాలో కొవిడ్‌ మూడో దశను ఎదుర్కొనేందుకు అధికారులంతా సిద్ధంగా ఉండాలన్నారు. వ్యాక్సినేషన్‌ ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. ఫీవర్‌ సర్వేను త్వరగా పూర్తిచేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఆక్సిజన్‌ బెడ్స్‌ అదనంగా ఏర్పాటు చేయాలన్నారు. శాంతిభద్రతల పరిరక్షణకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సందర్భంగా ఇటీవల కనిగిరిలో కొవిడ్‌తో తల్లిదండ్రులను కోల్పోయి అనాథ అయిన మువ్వా అభిరామ్‌కు ప్రభుత్వం మంజూరుచేసిన రూ.10లక్షల చెక్కును మంత్రి బాలినేని అందజేశారు. ఐసీడీఎస్‌ పీడీ లక్ష్మీదేవి, డీఎంహెచ్‌వో డాక్టర్‌ రత్నావళి ఉన్నారు. 





Updated Date - 2021-06-17T07:07:17+05:30 IST