పాజిటివ్‌ కేసులు ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో కట్టడి చర్యలు చేపట్టాలి

ABN , First Publish Date - 2021-06-04T05:20:09+05:30 IST

పాజిటివ్‌ కేసులు ఎక్కువ ఉన్న గ్రామాలు, ప్రాంతాల్లో కట్టడి చర్యలు పకడ్బందీగా అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌కుమార్‌ అన్నారు.

పాజిటివ్‌ కేసులు ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో కట్టడి చర్యలు చేపట్టాలి
సెల్‌ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న కలెక్టర్‌, ఎస్పీ

కామారెడ్డి టౌన్‌, జూన్‌ 3: పాజిటివ్‌ కేసులు ఎక్కువ ఉన్న గ్రామాలు, ప్రాంతాల్లో కట్టడి చర్యలు పకడ్బందీగా అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌కుమార్‌ అన్నారు. గురువారం ఆయన సెల్‌ కాన్ఫ రెన్స్‌లో జిల్లా కలెక్టర్‌లు, ఎస్పీలు, వైద్యాశాఖాధికారులతో సెల్‌ కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ గత వారం రోజుల నుంచి పాజిటివ్‌ కేసులు ఎక్కువగా వస్తున్న గ్రామాలు, ఆరోగ్య కేంద్రాల పరిధిలో ప్రత్యేక చర్యలు తీసుకోవాలని తెలిపారు. ప్రభుత్వ కొవిడ్‌ సెంటర్లు ఏర్పాటు చేసుకోవాలని, ఆ ప్రాం తాల్లో మరో విడత ఇంటింటి సర్వే చేపట్టాలని, లక్షణా లున్న వారికి కిట్స్‌, వైద్య చికిత్స అంద జేయాలని తెలిపారు. క్షేత్రస్థాయిలో ప్రజాప్రతినిధుల సహకారంతో కరోనా కట్టడి కి కృషి చేయాలని తెలిపారు. లాక్‌డౌన్‌ ఏర్పాట్లను పకడ్బం దీగా అమలు చేయాలని, లాక్‌డౌన్‌ మినహాయింపు సమ యంలో కూడా ప్రజలు సమూహాలుగా ఏర్పడకుండా, భౌతి కదూరం తప్పనిసరిగా పాటించేలా చూడాలని తెలిపారు. ఉపాధిహామీ పనులలో కూలీలు మాస్కులు ధరించి, భౌతికదూరం పాటించేలా అధికారులు చర్యలు తీసుకోవా లని తెలిపారు. వివాహాలు, అంత్యక్రియలకు నిబంధనలకు మించి ఉండరాదని, ప్రభుత్వ నిబంధనలు ఖచ్చితంగా అమలు చేయాలని సూచించారు.  లాక్‌డౌన్‌ నిబంధనలకు ఖచ్చితంగా పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్ట ర్‌ శరత్‌, ఎస్పీ శ్వేతారెడ్డి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ వెంకటేష్‌దోత్రే, డీఎంహెచ్‌వో చంద్రశేఖర్‌, డీపీవో సాయన్న పాల్గొన్నారు.
జిల్లాలో 21 కరోనా పాజిటివ్‌ కేసులు
కామారెడ్డి జిల్లాలో గురువారం 21 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. 29 ప్రభుత్వ ఆసుపత్రులలో నిర్వహించిన పరీక్షలలో 21 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఇందులో కామారెడ్డి 4, బాన్సువాడ 1, ఎల్లారెడ్డి 3, పిట్లం 1, బీబీపేట 1, ఎర్రాపహాడ్‌ 1, రామారెడ్డి 1, దేవునిపల్లి 2, రాజీవ్‌నగర్‌ 2, నాగిరెడ్డిపేట 2, పుల్కల్‌లలో 3 కేసులు నమోదయ్యాయి. కామారెడ్డి ప్రాఽథమిక సహకార సంఘ ఉద్యోగి బుధవారం రాత్రి కరోనాతో మృతి చెందినట్టు తోటి ఉద్యోగులు తెలిపారు.

Updated Date - 2021-06-04T05:20:09+05:30 IST