Advertisement
Advertisement
Abn logo
Advertisement

మద్యం తాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలు

కడ్తాల్‌: మద్యంతాగి వాహనాలు నడిపితే కఠినచర్యలు తప్పవని ఆమనగల్లు ట్రాఫిక్‌ ఎస్‌ఐ రఘుకుమార్‌ అన్నారు. మండలంలోని టోల్‌ప్లాజా వద్ద ఆదివారం సాయంత్రం ట్రాఫిక్‌ఐస్‌ఐ రఘుకుమార్‌ ఆధ్వర్యంలో డ్రంకెస్‌డ్రైవ్‌ నిర్వహించారు. మద్యం తాగి వాహనాలు నడుపుతున్న 25మందిని, లైసెన్సు లేకుండా వాహనాలు నడుపుతున్న ఆరుగురిపై కేసులు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు. రోడ్డు ప్రమాదాల నివారణకు వాహనదారులు, ప్రజలు పోలీసులకు సహకరించాలని రఘుకుమార్‌ కోరారు. కార్యక్రమంలో ఎస్‌ఐ లక్ష్మణ్‌నాయక్‌, సిబ్బంది సురేందర్‌, ఖలీం, సురేష్‌, మురళి, నర్సింహ, నజీర్‌, శబరి, అనిల్‌ పాల్గొన్నారు. 

Advertisement
Advertisement