నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు

ABN , First Publish Date - 2021-06-12T05:11:44+05:30 IST

మండలంలోని ఫర్టిలైజర్‌ షాపులలో నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని ఏవో హరీష్‌ అన్నారు.

నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు
ఎల్లారెడ్డిలో ఫర్టిలైజర్‌ దుకాణాల్లో తనిఖీ చేస్తున్న టాస్క్‌ఫోర్స్‌ అధికారులు

రామారెడ్డి, జూన్‌ 11: మండలంలోని ఫర్టిలైజర్‌ షాపులలో నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని ఏవో హరీష్‌ అన్నారు. శుక్రవారం మండలంలోని రెడ్డిపేట గ్రామంలో గల విత్తనాల షాపులలో తనిఖీలు నిర్వహించారు. షాపులలో ఎవ రైన కాలం చెల్లించిన నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తప్పని కేసులు నమోదు చేసి చర్యలు తీసు కుంటామని హెచ్చరించారు. విత్తనాలు ఎక్కడ నుం చి తెచ్చినా రిజిష్టర్‌లో వివరాలు నమోదు చేసి వాటి బిల్లులు వాటి స్టాక్‌ తదితర వివరాలు నమోదు చేయాలని తెలిపారు. ప్రతీ డీలరు రైతుకు రశీదు ఇవ్వాలని, ఎవరూ లైసెన్స్‌ లేకుండా విత్తనాలు అ మ్మరాదన్నారు. నాణ్యమైన విత్తనాలను మాత్రమే అ మ్మాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో  ఎస్సై భువ నేశ్వర్‌రావు, ఆర్‌ఐ వేణు, ఏఈవోలు షాపుల యాజ మానులు తదితరులు పాల్గొన్నారు.
ఎల్లారెడ్డిలో..
ఎల్లారెడ్డి: పట్టణంలో టాస్క్‌ఫోర్స్‌ అధికారులు ఎరువుల దుకాణాల్లో తనిఖీలు నిర్వహించారు. రైతు లకు అమ్మిన విత్తనాలకు, ఎరువులకు ఒరిజినల్‌ బిల్లులు ఇవ్వాలని తెలిపారు. ఎవరైన కల్తీ విత్తనా లు, మందులు అమ్మితే పీడీ యాక్ట్‌ కింద కేసులు నమోదు చేస్తామన్నారు. లైసెన్స్‌లేని దుకాణదారులు ఎవరైన విత్తనాలు, ఎరువులు అమ్మితే తమకు సమాచారం అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి ఏడీఏ శశిధర్‌, ఏవో శ్రీనివాస్‌, దేవునిపల్లి ఎస్‌ఐ మన్సూర్‌ఖాన్‌, ఎల్లారెడ్డి మండల వ్యవసా యాధికారి సంతోష్‌ తదితరులు పాల్గొన్నారు.
గాంధారిలో..
గాంధారి: మండల కేంద్రంలో శుక్రవారం మెదక్‌ జిల్లా రామచంద్రపురం విజిలెన్స్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భం గా మండల కేంద్రంలోని ఓ దుకాణాన్ని తనిఖీ చే స్తుండగా మిగతా దుకాణ యాజమాన్యాలు దుకా ణాలకు తాళం వేసి వెళ్లిపోయారు. దీంతో తెరిచి ఉన్న దుకాణాల్లో అధికారులు తనిఖీలు నిర్వహించి దుకాణ యజమానికి నోటీసులు అందజేశారు. ఈ సందర్భంగా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అసిస్టెంట్‌ విజిలెన్స్‌ అధికారి విజయ్‌కుమార్‌ ఎరువుల దుకాణం నుంచి శాంపిల్స్‌ సేకరించి ల్యాబ్‌కు తరలించాలని వ్యవసా యాధికారులకు సూచించారు.

Updated Date - 2021-06-12T05:11:44+05:30 IST