డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లలో పేదలను విస్మరిస్తే కఠిన చర్యలు

ABN , First Publish Date - 2021-10-23T06:27:34+05:30 IST

రాష్ట్రంలో ఏ నియోజకవర్గానికి 10 వేల డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లు మంజూరు కాలేదని, సీఎం కేసీఆర్‌ ప్రత్యేక చొరవతోనే ఇన్ని డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లు మంజూరు చేశారని, ఈ ఇళ్లలో పేద వారిని మాత్రమే అర్హులుగా ఎంపిక చేయాలని లేని పక్షంలో కఠిన చర్యలు తీసుకుంటామని

డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లలో పేదలను విస్మరిస్తే కఠిన చర్యలు
కోటగిరి మార్కెట్‌ కమిటీ అధ్యక్షురాలిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న తేళ్ల లావణ్య, పాల్గొన్న స్పీకర్‌ పోచారం

రైతులకు అన్నివిధాలా అండగా ప్రభుత్వం

కోటగిరి మార్కెట్‌ కమిటీ పాలకవర్గ ప్రమాణస్వీకార కార్యక్రమంలో స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి

కోటగిరి, అక్టోబరు 22: రాష్ట్రంలో ఏ నియోజకవర్గానికి 10 వేల డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లు మంజూరు కాలేదని, సీఎం కేసీఆర్‌ ప్రత్యేక చొరవతోనే ఇన్ని డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లు మంజూరు చేశారని, ఈ ఇళ్లలో పేద వారిని మాత్రమే అర్హులుగా ఎంపిక చేయాలని లేని పక్షంలో కఠిన చర్యలు తీసుకుంటామని స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి హెచ్చరించారు. కోటగిరి మండల వ్యవసాయ మార్కెట్‌ కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని శుక్రవారం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మండలంలోని లింగాపూర్‌ చౌరస్తా నుంచి మార్కెట్‌ కమిటీ వరకు భారీ బైక్‌ర్యాలీతో సభాపతికి ఘన స్వాగతం పలికారు. మార్కెట్‌ కమిటీ కార్యాలయ ఆవరణలో నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారం చేపట్టారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో స్పీకర్‌ మాట్లాడుతూ.. బాన్సువాడ నియోజకవర్గానికి 10 వేల ఇళ్లు మంజూరు చేయించామన్నారు. అనంతరం కోటగిరిలో వ్యవసాయ, సహకార సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించారు. కార్యక్రమంలో జేడీఏ గోవింద్‌, డీసీవో సింహాచలం, ఆర్డీవో రాజేశ్వర్‌,  నియోజకవర్గ నాయకులు పోచారం సురేందర్‌రెడ్డి, జడ్పీటీసీ శంకర్‌పటేల్‌, ఏఎంసీ చైర్మన్‌ తేళ్ల లావణ్య, మండల రైతు సమన్వయ సమతి అధ్యక్షుడు కిషోర్‌, తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-10-23T06:27:34+05:30 IST