Advertisement
Advertisement
Abn logo
Advertisement

కూరగాయల ధరలు పెంచితే కఠిన చర్యలు

 ఎమ్మెల్యే రక్షణనిధి

తిరువూరు, డిసెంబరు 1: చీరాల సెంటర్‌లోని రైతుబజార్‌ను ఎమ్మెల్యే కొక్కిలిగడ్డ రక్షణనిధి బుధవారం ఆకస్మికంగా  తనిఖీ చేశారు. స్టాల్స్‌వద్ద కూరగాయల ధరలు సూచిస్తూ ఏర్పాటు చేసిన బోర్డులు పరిశీలించారు. రైతుబజార్‌లో ఎవ్వరైన కాయగూరలు అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు ఫిర్యాదు వస్తే షాపు లైసెన్స్‌ రద్దుచేయిస్తామని హెచ్చరించారు. మార్కెల్‌లో 14 మంది డ్వాక్రా గ్రూపుల సభ్యులకు రైతుబజార్‌లో కూరగాయల స్టాల్‌ ఏర్పాటుకు మంజూరు అయిన లైసెన్స్‌లు అందించారు. లబ్ధిదారులతో వెంటనే షాపులు ఏర్పాటు  చేయించాలని ఎస్టేట్‌ ఆఫీసర్‌ పుష్పవల్లిని ఆదేశించారు. అనంతరం మున్సిపల్‌ పరిధిలోని సుంకర వీరభద్రరావు షాపింగ్‌ కాంప్లెక్స్‌ను పరిశీలించి, శిథిలావస్థకు చేరటంతో మరమ్మతులు చేయించాలని మున్సిపల్‌ అధికారులను ఆదేశించారు. అనంతరం క్యాంప్‌ కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. తహసీల్దార్‌ స్వర్గం నరసింహారావు, మున్సిపల్‌ మేనేజర్‌ మనోజ, టీపీవో మూర్తి, ఆర్‌డబ్ల్యూఎస్‌, హౌసింగ్‌, మండల పరిషత్‌ అధికారులు, కౌన్సిలర్లు తంగిరాల వెంకటరెడ్డి, పరసా శ్రీనివాసరావు(బీరువాలబాబు), పసుపులేటి శేఖర్‌బాబు, మోదుగు ప్రసాద్‌ పాల్గొన్నారు. 


Advertisement
Advertisement