డాక్టర్లపై దాడులు చేస్తే కఠిన చర్యలు

ABN , First Publish Date - 2021-06-19T05:52:15+05:30 IST

కరోనా విపత్కర పరిస్థితుల్లో డాక్టర్లు ఎంతగానో సేవ లందిస్తున్నారని, అలాంటి వారిపై దాడులు చేస్తే కఠి న చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఎక్సైజ్‌, క్రీడలు, సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్‌ హెచ్చరించారు.

డాక్టర్లపై దాడులు చేస్తే కఠిన చర్యలు
మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌కు వినతిపత్రం సమర్పిస్తున్న ఐఎంఏ డాక్టర్లు

- రాష్ట్ర ఎక్సైజ్‌, క్రీడలు, సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌

మహబూబ్‌నగర్‌ (వైద్యవిభాగం), జూన్‌ 18 : కరోనా విపత్కర పరిస్థితుల్లో డాక్టర్లు ఎంతగానో సేవ లందిస్తున్నారని, అలాంటి వారిపై దాడులు చేస్తే కఠి న చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఎక్సైజ్‌, క్రీడలు, సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్‌ హెచ్చరించారు. నేషనల్‌ ప్రొటెక్షన్‌ డే సందర్భంగా డాక్టర్లపై దాడులను ఖండిస్తూ ఐఎంఏ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లాకేంద్రంలోని ఆర్‌అండ్‌బీ అతిఽథి గృహ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కార్యక్ర మానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కరోనా మహమ్మారిని తరిమికొట్టడంలోనూ, కొవిడ్‌ రో గులకు వైద్యసేవలందించడంలో డాక్టర్ల సేవలు అభి నందనీయమని, అలాంటి డాక్టర్లపై, ఆసుపత్రులపై దాడులు చేయడం హేయమైన చర్య అని అన్నారు. ఏ డాక్టరైనా రోగికి నయం చేయాలని మాత్రమే చూ స్తాడని, ప్రాణాలు తీసే పనిచేయరని, డాక్టర్లు ప్రాణం పోసే దేవుళ్లు అని అన్నారు. ఎట్టి సందర్భంలో డాక్టర్ల పై దాడులు చేసిన వారిని కఠినంగా శిక్షించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమం లో మునిసిపల్‌ చైర్మన్‌ కేసీ నర్సింహులు, ఐఎంఏ జి ల్లా అధ్యక్షుడు డా. రాంమోహన్‌, నాయకులు డా. మహేష్‌బాబు, డా. శ్యామూల్‌, డా. మధుసూదన్‌రెడ్డి, డా. విజయ్‌కాంత్‌, డా. అనిల్‌ వట్టెంవార్‌, డా. రమేష్‌ సరోడే, డా. శేఖర్‌, డా. సంపత్‌ పాల్గొన్నారు.

ప్రతీ ఒక్కరు మొక్కలను రక్షించాలి

మహబూబ్‌నగర్‌, జూన్‌ 18 : ప్రతీ ఒక్కరు మొక్క లు నాటడంతోపాటు వాటి సంరక్షణ బాధ్యత తీసుకో వాలని రాష్ట్ర ఎక్సైజ్‌శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ అన్నా రు. అడవులను పెంచడమే లక్ష్యంగా మొక్కలు నాటే కార్యక్రమంలో ప్రతీ ఒక్కరు భాగస్వామ్యం కావాలని కోరారు. శుక్రవారం హరితహారం కార్యక్రమంలో భాగంగా జిల్లా కేంద్రంలోని బైపాస్‌ రహదారిలో బహుళ వరుసలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమం లో పాలొన్న మంత్రి మాట్లాడారు. వచ్చే వారం, పది రోజుల్లో అటవీశాఖ మంత్రితో కలిసి జిల్లాలో పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించ నున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్‌ ఎస్‌ వెంకట్రావు, అడిషినల్‌ కలెక్టర్‌ తేజస్‌ నందలాల్‌ పవార్‌, మునిసిపల్‌ చైర్మన్‌ కోరమోని నర్సింహులు, డీసీసీబీ ఉపాధ్యక్షుడు వెంకటయ్య, కమిషనర్‌ ప్రదీప్‌ కుమార్‌, కౌన్సిలర్‌ వనజ పాల్గొన్నారు. 



Updated Date - 2021-06-19T05:52:15+05:30 IST