Advertisement
Advertisement
Abn logo
Advertisement

విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు


- ప్రజల సమస్యలు సకాలంలో పరిష్కరించాలి

: కలెక్టర్‌ నాగలక్ష్మి సెల్వరాజన

రాప్తాడు, నవంబరు 30: సచివాలయ ఉద్యోగులు విధుల పట్ల ని ర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్‌ నాగలక్ష్మి సెల్వరాజన హెచ్చరించారు.  రాప్తాడు మండలంలోని బొమ్మేపర్తి, హంపాపురం గ్రామ సచివాలయాలను ఆమె మంగళవారం అకస్మికంగా త నిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ ఆయా సచివాలయాల్లోని రిజిస్టర్లు, బయోమెట్రిక్‌ హాజరును పరిశీలించారు. సచివాలయ ఉద్యో గులు నిర్ణీత సమయం వరకూ ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు. ప్రజల సమస్యలు వెంటనే పరిష్కరించాలన్నారు. సచివాలయాలకు వస్తున్న సేవలను పెండింగ్‌ ఉంచకుండా గడువులోగా పరి ష్కరించాలన్నారు. ప్రభుత్వ పథకాలకు అర్హులు, అనర్హుల జాబితా ను సచివాలయాల్లో ప్రదర్శించాలన్నారు. ప్రభుత్వ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు పం టలు నష్టపోయిన రైతులకు పరిహారం అందేలా చూడాలన్నారు. ఒ క్కో సచివాలయం నుంచి రోజుకు కనీసం ఐదుగురు లబ్ధిదారులను సంపూర్ణ గృహ హక్కు పథకం కింద నమోదు చేయాలన్నారు. డిసెంబరు 2న నిర్వహించనున్న మెగా మేళాలో అధిక మంది లబ్ధిదారులు హాజరయ్యేలా చూడాలన్నారు. వనటైం సెటిల్‌మెంట్‌ లబ్ధిదారుల స ర్వేను వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు. అనంతరం హంపాపురం ఉన్నత పాఠశాలలో మధ్యా హ్న భోజనం గురించి విద్యార్థులతో ఆరా తీశారు. గ్రామస్థులకు 15రోజల్లోగా తాగు నీటి సౌక ర్యం కల్పిస్తామన్నారు. కార్యక్రమంలో ధర్మవరం ఆర్డీఓ వరప్రసాదరావు, తహసీల్దార్‌ ఈర మ్మ, ఎంపీడీఓ సాల్మనరాజ్‌, ఈఓఆర్డీ మాధవి, ఎంపీపీ జయలక్ష్మి, మండల విద్యాధికారి మల్లికార్జున, సర్పంచులు ఆనంద్‌రెడ్డి, లక్ష్మీదేవి, పంచాయతీ కార్యదర్శులు చరణ్‌కుమార్‌, రామచంద్రారెడ్డి, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. 


Advertisement
Advertisement