పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు

ABN , First Publish Date - 2021-05-08T05:01:18+05:30 IST

మండలంలో శ్మశానవాటిక నిర్మాణంలో నిర్లక్ష్యం వహించే సర్పంచ్‌లపై, కార్యదర్శులపై చర్యలు తప్పవని డీపీఓ గీత అన్నారు.

పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు
కనగర్తిలో సర్వేను పరిశీలిస్తున్న డీపీవో గీత

- డీపీవో గీత

ఓదెల, మే 7: మండలంలో శ్మశానవాటిక నిర్మాణంలో నిర్లక్ష్యం వహించే సర్పంచ్‌లపై, కార్యదర్శులపై చర్యలు తప్పవని డీపీఓ గీత అన్నారు. మండ లంలోని కనగర్తి, గూడెం, గుంపుల, ఇందుర్తి, శానగొండ, ఓదెల, హరిపురం లో శుక్రవారం డీపీఓ గీత పలు పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా విలేకరులతో ఆమె మాట్లాడుతూ ఓదెల, హరిపురం, ఇందుర్తి, గుంపుల, గూడెం గ్రామాల్లో మార్చి 31 వరకు పూర్తి కావాల్సిన శ్మశానవాటిక పనులు ఏమాత్రం కాలేదని, 5 రోజుల్లో మార్పు రాకుంటే తదుపరి చర్యల కోసం కలెక్టర్‌కు నివేదిక సమర్పించనున్నట్లు తెలిపారు. అలాగే కొవిడ్‌ బాధితుల కు కిట్లు ఇస్తున్నారా.. లేదా వారికి కరోనా లక్షణాల్లో మార్పు వస్తున్నాయి అనే విషయమై పరిశీలించి వ్యాక్సిన్‌ సర్వే రిజిష్టర్‌లను తనిఖీ చేశారు. గూడెంలో తయారవుతున్న వర్మికంపోస్టు ఎరువుల కేంద్రాన్ని సందర్శించా రు. అసంపూర్తిగా ఉన్న పనులను పూర్తిచేయాలని ఉపాధి పనుల్లో జాప్యం చేయకుండా పనులను కల్పించాలని, ఎండల తీవ్రత పెరుగుతున్నందున కూలీలకు, రక్షణ జాగ్రత్తలను తీసుకోవాలని సిబ్బందికి సూచించారు. 

Updated Date - 2021-05-08T05:01:18+05:30 IST