వ్యర్థాలను పడేస్తే కఠిన చర్యలు

ABN , First Publish Date - 2020-08-11T11:03:55+05:30 IST

కొబ్బరి బొండాల వ్యర్థాలను బయటి పడేస్తే కఠిన చర్యలు ఉంటాయని జీడబ్ల్యూఎంసీ కమిషనర్‌ పమేలా సత్పతి వ్యాపారులను హెచ్చరించారు.

వ్యర్థాలను పడేస్తే కఠిన చర్యలు

కమిషనర్‌ పమేలా సత్పతి


వరంగల్‌ సిటీ, ఆగస్టు 10 : కొబ్బరి బొండాల వ్యర్థాలను  బయటి పడేస్తే కఠిన చర్యలు ఉంటాయని జీడబ్ల్యూఎంసీ కమిషనర్‌ పమేలా సత్పతి వ్యాపారులను హెచ్చరించారు. సోమవారం వరంగల్‌ బల్దియా కార్యాలయంలో కొబ్బరి బొండాల వ్యాపారులతో ఆమె సమావేశమయ్యారు. బొండాల వ్యర్థాలను నాలాలు, కాకతీయ కెనాల్‌ ప్రాంతం ఇతర బహిరంగ ప్రదేశాల్లో పడవేస్తున్నారన్నారు. ఈ కారణంగా దోమలు వ్యాప్తి చెందుతున్నాయని అన్నారు. జీడబ్ల్యూఎంసీ ఆధ్యర్యంలో బొండాల వ్యర్థాలను సేకరించే క్రమంలో సహకరించాలని సూచించారు. ఇందుకోసం యూజర్‌ చార్జీలను వసూలు చేస్తామని చెప్పారు. వ్యాపారులు వ్యర్థాలను డీఆర్‌సీకి కూడా పంపవచ్చని తెలిపారు. వ్యర్థాల నిర్వహణ కోసం 15 రోజుల సమయం ఇస్తున్నట్లు వ్యాపారులకు తెలియచేశారు. మార్చుకోని పక్షంలో తగు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. 


పనులలో నాణ్యతేదీ...?

అభివృద్ధి పనుల్లో నాణ్యత ఉండడం లేదని కమిషనర్‌ పమేలా సత్పతి అధికారులు, కాంట్రాక్టర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం 46, 47, 51తో పాటు పలు డివిజన్లలో కమిషనర్‌ ఆకస్మిక తనిఖీలు జరిపారు. రహదారులు, డ్రెయినేజీ ఇతర పనులను పరిశీలించారు. పనులలో నాణ్యత ప్రమాణాల పాటించడం లేదని ఇంజినీర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. క్యూరింగ్‌ కూడా సరిగా జరపకపోవడం ఏమిటని మండిపడ్డారు. నాణ్యత ఉంటేనే బిల్లులు మంజూరు చేస్తానని స్పష్టం చేశారు.  ఇదిలా ఉండగా జవహార్‌కాలనీలో డ్రెయినేజీ విచ్ఛిన్నానికి కారణమైన వ్యక్తికి కమిషనర్‌ రూ.10వేల జరిమానా విధించారు. 

Updated Date - 2020-08-11T11:03:55+05:30 IST