పప్పుశనగ కొనుగోలుకు సవాలక్ష నిబంధనలు

ABN , First Publish Date - 2021-05-16T05:58:09+05:30 IST

రైతుల పంట ఉత్పత్తుల కొనుగోళ్లకు సవాలక్ష ని బంధనలు పెడుతుండటంతో రైతులు పంటల విక్రయానికి ముందుకు రావడం లేదు. తాజాగా మండలంలో హనకనహాళ్‌, సొల్లాపురం, హనుమాపురం హనకనహాళ్‌, మాల్యం, కణేకల్లు, తదితర ప్రాంతాల్లో దాదాపు పదివేల హెక్టార్ల మేర రైతులు పప్పుశనగను పండించారు.

పప్పుశనగ కొనుగోలుకు సవాలక్ష నిబంధనలు

 విక్రయానికి ముందుకు రాని రైతులు 


కణేకల్లు, మే 15  : రైతుల పంట ఉత్పత్తుల కొనుగోళ్లకు సవాలక్ష ని బంధనలు పెడుతుండటంతో రైతులు పంటల విక్రయానికి ముందుకు రావడం లేదు. తాజాగా మండలంలో హనకనహాళ్‌, సొల్లాపురం, హనుమాపురం హనకనహాళ్‌, మాల్యం, కణేకల్లు, తదితర ప్రాంతాల్లో దాదాపు పదివేల హెక్టార్ల మేర రైతులు పప్పుశనగను పండించారు. వీటిని ప్ర భుత్వ కొనుగోలు కేంద్రాల ద్వారా విక్రయించాలనుకుంటున్న రైతులకు మార్క్‌ఫెడ్‌ శాఖ పెట్టిన నిబంధనలను చూసి ఖంగుతింటున్నారు. 


ఒక్కో రైతు నుంచి పది క్వింటాళ్ల వరకే కొనుగోలు 

ఎకరాకు రెండు క్వింటాళ్ల చొప్పున గరిష్టంగా ఐదు ఎకరాలకు పది క్విం టాళ్ల వరకే రైతుల నుంచి పప్పుశనగ కొనుగోలు చేసేందుకు అధికారులు మొగ్గుచూపుతుండటంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. గతేడాది ఎకరాకు ఐదు క్వింటాళ్ల మేర గరిష్టంగా 20 ఎకరాల వరకు వంద క్వింటాళ్ల మేర కొనుగోలు చేశారు. కానీ ఈ యేడాది ఒక్కసారిగా పద్ధతిని పూర్తిగా మార్చి వేయడంతో రైతన్నలు గగ్గోలు పెడుతున్నారు. 


30 శాతం మందివే..

రైతులు పండించిన పప్పుశనగను ప్రభుత్వానికి విక్రయించాలంటే త ప్పనిసరిగా రైతు భరోసా కేంద్రాల్లో నమోదు చేసుకోవాల్సి వుంటుంది. ఇం దులో నమోదు చేసుకున్న రైతుల జాబితా నుంచి కేవలం 30 శాతం మం దివి మాత్రమే కొనుగోలు చేస్తుండటంతో మిగతా 70 శాతం మంది రై తులు తమ పంటలను ఎక్కడ విక్రయించుకోవాలో తెలియక సతమతమవుతున్నారు. ఒకొక్క గ్రామంలో వంద మంది వరకు రైతులు పంటను వి క్రయిస్తామని ఇప్పటికే రిజిస్ట్రేషన చేయించు కుని వుండగా వారిలో 30 మంది రైతులవి మాత్రమే మేము కొనుగోలు చేస్తామని, మిగిలిన రైతుల పంటను కొనుగోలు చేయమని కరాఖండిగా చెబుతుండటంతో రైతులు త ప్పనిసరి పరిస్థితుల్లో ప్రైవేటు వ్యక్తులను ఆశ్రయిస్తున్నారు. 


ధరలన్నీ సమానమే..

ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల ద్వారా రైతుల నుంచి సేకరిస్తున్న పప్పుశనగ ధరలు బహిరంగ మార్కెట్‌లోను, ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలోని ధరలు సమానంగా వుంటుండటంతో రైతులు వీటిపై పెద్దగా ఆసక్తి చూ పడం లేదు. ప్రస్తుతం క్వింటాల్‌ పప్పుశనగకు ప్రభుత్వ మద్దతు ధర రూ. 5100లు వుండగా బహిరంగ మార్కెట్లో కూడా రూ. 4900 నుంచి రూ. ఐదు వేలు పలుకుతుండటంతో రైతులు కొనుగోలు కేంద్రాలకు అమ్మేందుకు పెద్దగా ఆసక్తి చూపడంలేదు. గతేడాది జిల్లా వ్యాప్తంగా 11 కౌంటర్ల ద్వారా దాదాపు 4 లక్షల క్వింటాళ్ల పప్పుశనగను కొనుగోలు చేసిన ప్ర భుత్వం ఈ యేడాది ప్రతి రైతు భరోసా కేంద్రంను కౌంటర్‌గా ఏర్పాటు చేసి పప్పుశనగ కొనుగోలుకు సిద్ధంగా వున్నప్పటికీ కేవలం 15 వేల క్విం టాళ్లు మాత్రమే ఇప్పటివరకు కొనుగోలు చేయడం గమనార్హం. మండలంలో దాదాపు వెయ్యి మంది రైతులు పప్పుశనగ అమ్ముతామని నమోదు చేసుకోగా, ఇప్పటివరకు కేవలం 40 మంది రైతులు మాత్రమే విక్రయించారు. సొమ్ము పంపిణీలోజాప్యంతో రైతులు ఆసక్తి చూపడం లేదు. 


Updated Date - 2021-05-16T05:58:09+05:30 IST