Abn logo
May 14 2021 @ 00:49AM

కరోనా నివారణకు కఠిన చర్యలు

దర్శి, మే 13 : కరోనా వ్యాప్తి చెందకుండా అధికారులు పటిష్ట చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్‌ సూచించారు. స్థానిక మండల పరిషత్‌ కార్యాలయంలో గురువారం నియోజకవర్గంలోని అధికారులతో జరిగిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. రెండవ దశ కరోనా ఉదృతంగా ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. గ్రామాల్లో పారిశుధ్య కార్యక్రమాలు క్రమం తప్పకుండా చేస్తూ శానిటైజేషన్‌ విధిగా చేయాలన్నారు. 

అనంతరం కస్తూర్భా పాఠశాల, మోడల్‌స్కూల్లో ఏర్పాటుచేసిన కొవిడ్‌ కేర్‌ సెంటర్లను ఎమ్మెల్యే పరిశీలించారు. రోగులకు అందుతున్న వైద్యం, వసతులు, భోజనం ఎలా ఉందనే విషయాన్ని పరిశీలించారు. రైతు భరోసా కేంద్రంలో ముఖ్యమంత్రి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. కార్యక్రమంలో దర్శి ఏఎంసీ చైర్మన్‌ ఇడమకంటి వేణుగోపాల్‌రెడ్డి, నియోజకవర్గ ప్రత్యేకాధికారి జీవీ.నారాయణరెడ్డి, మండల ప్రత్యేకాధికారి కె.అర్జున్‌నాయక్‌, దర్శి సీఐ భీమానాయక్‌, నియోజకవర్గంలోని తహసీల్దార్లు, ఎంపీడీవోలు, వైద్యాధికారులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Advertisement