కఠినతరమైన ఆంక్షలా...! అమలు ఎక్కడ ?

ABN , First Publish Date - 2021-05-08T04:56:43+05:30 IST

కండ్‌ వేవ్‌లో వైరస్‌ వ్యాప్తి అంత్యంత వేగంగా సాగుతోంది. వైరస్‌ కరాళ నృత్యం చేస్తున్న తరుణంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వా లు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాయి.

కఠినతరమైన ఆంక్షలా...! అమలు ఎక్కడ ?
బ్యాంక్‌ వద్ద గుంపులుగా గుమిగూడిన జనం (ఫైల్‌ఫొటో)

కరోనా వ్యాప్తి కట్టడి జరిగేనా?

టెస్టుల్లో జాప్యం

కానరాని సంజీవిని బస్సులు

బద్వేలులో విజృంభిస్తున్న వైరస్‌

బద్వేలు రూరల్‌, మే 7: సెకండ్‌ వేవ్‌లో వైరస్‌ వ్యాప్తి అంత్యంత వేగంగా సాగుతోంది. వైరస్‌ కరాళ నృత్యం చేస్తున్న తరుణంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వా లు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాయి. ఇందులో భాగంగా ఆంక్షలు కఠిన తరం చేయడం, అత్యవసర మైతేతప్ప బయటకు రాకూడదు, మాస్కులు ధరిం చాలని చెబుతూ వ్యాక్సినేషన్‌పై దృష్టి పెట్టింది.

పట్ట ణాల్లో ప్రజలు తిరిగే విధానం చూస్తే కఠినతర ఆం క్షల చిరునామాను ప్రశ్నించవచ్చు. పాజిటివ్‌, మృతు ల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నా అధికారులు పరుగులెత్తేందుకు సైతం ఆలోచిస్తున్నట్లు కనబడు తోంది. ప్రస్తుతం వైరస్‌ వ్యాప్తిని గుర్తించే లోపే బా ధితుడు ప్రాణాలు కోల్పోతున్న సందర్భాలు  ఎక్కు వగా కనబడుతున్నాయి. గతంలో జిల్లా వ్యాప్తంగా ప్రతి వాడకూ సంజీవని బస్సులు తిరుగుతూ ప్రజ లకు నిరంతరం టెస్తులు చేసే వారు. ప్రస్తుతం సంజీవని బస్సుల జాడే కన్పించడంలేదు. 

టెస్తులు చేసే విధానంలో ప్రస్తుతానికి గతానికి తేడా కన్పిస్తోంది. వ్యాక్సినేషన్‌ వేయించుకోమని అధికారు లు ప్రకటనలు గుప్పిస్తున్నా టీకాలు తెప్పించడంలో విఫలమయ్యారనే విమర్శలు లేకపోలేదు. ప్రజల అలసత్వం, అధికారుల నిర్లక్ష్యం వెరసి వైరస్‌ వ్యాప్తి వేగాన్ని పెంచుతుండడంతో ప్రజలు నష్టపోవాల్సి వస్తోంది. వైరస్‌ వ్యాప్తిని నిరోధించేందుకు కఠిన ఆంక్షలు విధిస్తున్నా కట్టడి సమాధానం లేని ప్రశ్న గా మిగిలిపోతోంది. వివరాల్లోకెళితే....

 జిల్లాలో పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతోంది. ఇటీవల కరోనా బారిన పడిన కొందరు ప్రాణాలు కోల్పోవడంతో ప్రజల్లో భయాందోళనలు మొదలవు తోంది. పట్టణంలో దాదాపు 80వేల పైబడి జనాభా ఉన్నారు. వీరికి తోడు ఏ చిన్న అవసరం వచ్చినా చుట్టుపక్కల గ్రామీణులు పట్టణానికి రావాల్సిందే. ఇలా వచ్చేవారితో కలిపి జనాభా సంచారం ఎక్కువ వుతోంది.

రెండో  దశ విజృంభిస్తున్న నేపఽథ్యంలో గ్రామీణులు సైతం బాధితులుగా మారుతున్నారు. అయితే వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేసేందుకు అధికారు లు ఆంక్షలు తయారు చేసి ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 2 వరకు మాత్రమే దుకాణాలు తెరవా లని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. కర్ఫ్యూ పై అవగాహన లోపం, అధికారుల నిర్లక్ష్యం కరోనా వ్యాప్తికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.

టెస్టుల  ఫలితాల్లో జాప్యం

  కరోనా మొదటి దశలో ప్రభుత్వమే టెస్టులను నిర్వహించేది. అప్పట్లో స్థానిక పభుత్వ ఆస్పత్రికి రెండు ట్రూనాట్‌ మిషన్లను ఏర్పాటు చేసి టెస్టులను నిర్వహించేవారు. ఒక రోజులోనే ఫలితాలు వస్తుండ డంతో బాధితులకు చికిత్స చేయించేవారు. అయితే సెకండ్‌ వేవ్‌లో అందుకు భిన్నంగా జరుగుతుండ డ మే వైరస్‌ వ్యాప్తికి కారణమని పలువురి వాదన. 

ప్రైమరీ, సెకండరీ కాంటాక్టుల ఊసే లేదు

 ఒకరికి పాజిటివ్‌ వస్తే వెంటనే ప్రైమరీ, సెకండరీ కాంటాక్టులను గుర్తించి వారికి టెస్టులు నిర్వహించి చికిత్స అందిస్తుండడంతో గతంలో వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేయగలిగారు. నేడు కేసులనే గుర్తించలేని పరిస్థితి ఏర్పడింది. 

అడ్రస్‌లేని సంజీవిని బస్సులు

 కరోనా మొదటి దశలో జిల్లా వ్యాప్తంగా సంజీవిని బస్సుల ద్వారా కరోనా టెస్టులు నిర్వహించేవారు. ప్రతి రోజూ  మారుమూల గ్రామాలకు సైతం సంజీ విని బస్సుల కోసం ఆరా తీసేవారు. నెలలో దాదాపు నాలుగైదు దఫాలు సంజీవిని బస్సు ద్వారా టెస్టులు నిర్వహించే వారు. రెండో దశలో సంజీవిని బస్సుల జాడే కన్పించకపోవడంతో కరోనా లక్షణాలున్నవారు ప్రభుత్వ టెస్టులతో జాప్యం జరుగుతుందని, ప్రైవే టుకు ఎక్కువ చెల్లించలేక మిన్నకుండా ఉంటున్నా రు.

మరికొందరు అప్పు చేసైనా బయటి ఊర్లలో చికిత్స పొందుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత జిల్లా, వైద్య శాఖ అధికారులు స్పందించి ప్రభుత్వం ద్వారా చేసే కరోనా టెస్టులు వేగవంతం చేసి ప్రజలు ఆర్థికంగా నష్టపోకుండా చేసి, ప్రజల ప్రాణాలు కాపాడాలని కోరుతున్నారు.



Updated Date - 2021-05-08T04:56:43+05:30 IST