Abn logo
Sep 25 2021 @ 23:41PM

పటిష్టంగా పొగాకు నియంత్రణ చట్టం

మాట్లాడుతున్న ఎస్పీ అమిత్‌బర్దర్‌

  ఎస్పీ అమిత్‌బర్దర్‌ 

శ్రీకాకుళం,ఆంధ్రజ్యోతి: జి ల్లాలో పొగాకు నియంత్రణ చట్టం మరింత పటిష్టంగా అమలు కావా లని ఎస్పీ అమిత్‌బర్దర్‌ తెలిపారు. శనివారం జిల్లా పోలీసు కార్యాల యం నుంచి వైద్యఆరోగ్యశాఖ అధికా రులతో కలసి పోలీసులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. పొగాకు ఉత్పత్తుల వినియోగంతో తలెత్తే  దుష్ప రిణామాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని ఎస్పీ ఆదేశించారు. యువత వీటికి బానిసకాకుండా చూడాలన్నారు. విద్యాసంస్థల్లో సదస్సులు నిర్వహించాలని సూచించారు. 18 ఏళ్లలోపు వారికి పొగాకు ఉత్పత్తులు విక్రయించడం నేరమని చెప్పారు. కార్యక్రమంలో జాతీయ పొగాకు నియం త్రణ రాష్ట్ర ప్రోగ్రాం అధికారి ప్రశాంత్‌, రాష్ట్ర న్యాయ సలహాదారుడు శివశంకర్‌,  ఏఎస్పీ విఠలేశ్వరరావు, సోషల్‌ వర్కర్‌ సుమంతి, అడిషనల్‌ డీఎంహెచ్‌వో లీలాకుమారి, తదితరులు పాల్గొన్నారు.