పక్కాగా వేట నిషేధం అమలు

ABN , First Publish Date - 2021-04-18T05:32:10+05:30 IST

వేట నిషేధం పక్కాగా అమలుచేస్తున్న దృష్ట్యా మత్స్యకారులు సహకరించాలని మత్స్యశాఖ ఉప సంచాలకులు ఎన్‌.నిర్మలాకుమారి కోరారు. ముక్కాంలో శనివారం మత్స్యకారులకు చేపల వేట నిషేధంపై అవగాహన కల్పించారు.

పక్కాగా వేట నిషేధం అమలు
ఏజెన్సీలో రాతికట్ట పనులు చేసిన దృశ్యం (ఫైల్‌)





 మత్సశాఖ ఉప సంచాలకులు నిర్మలాకుమారి

భోగాపురం, ఏప్రిల్‌ 17: వేట నిషేధం పక్కాగా అమలుచేస్తున్న దృష్ట్యా మత్స్యకారులు సహకరించాలని మత్స్యశాఖ ఉప సంచాలకులు ఎన్‌.నిర్మలాకుమారి కోరారు. ముక్కాంలో శనివారం మత్స్యకారులకు చేపల వేట నిషేధంపై అవగాహన కల్పించారు. నిర్మలాకుమారి మాట్లాడుతూ సుమారు రెండు నెలల పాటు మత్స్యకారులు ఉపాధికి దూరమవుతున్న దృష్ట్యా ప్రభుత్వం భృతి అందిస్తుందన్నారు. మత్స్యకార భరోసాను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సముద్రంలో మత్స్యసంపద వృద్ధి చెందాలంటే తప్పకుండా వేట నిషేధం పక్కాగా అమలుచేయాల్సిన అవసరముందన్నారు. ప్రభుత్వ నిషేధాజ్ఞలు అతిక్రమిస్తే బోటు సీజ్‌ చేయడంతో పాటు ప్రభుత్వ రాయితీలు నిలిపివేస్తామని హెచ్చరించారు. అన్ని బోట్లకు రంగులు వేయాలన్నారు. ఈ నెల 19 నుంచి గ్రామాల వారీగా బోట్ల గణన ప్రారంభమవుతుందన్నారు. తప్పనిసరిగా మత్స్యకారులు రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలన్నారు. అధికారులకు పూర్తి వివరాలు అందించాలన్నారు. పారదర్శకంగా మత్స్యకార భరోసా అందిస్తామని.. ఈవిషయంలో అనవసర ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.  మత్స్యశాఖ ఏడీ కిరణ్‌కుమార్‌, మత్స్యశాఖ సహాయకులు షరీప్‌ పాల్గొన్నారు.






Updated Date - 2021-04-18T05:32:10+05:30 IST