పటిష్టంగా లాక్‌డౌన్‌

ABN , First Publish Date - 2021-05-15T05:45:10+05:30 IST

జిల్లాలో లాక్‌డౌన్‌ను పోలీసులు పటిష్టంగా అమలు చేస్తున్నారు. మొదటి రెండు రోజులు పోలీసులు కొంత చూసీచూడనట్లు వ్యవహరించగా శుక్రవారం మూడో రోజు కఠినంగానే వ్యవహరించారు.

పటిష్టంగా లాక్‌డౌన్‌
లాక్‌డౌన్‌తో నిర్మానుష్యంగా కమాన్‌ సర్కిల్‌

 10 గంటలకు మూతపడ్డ దుకాణాలు 

- నిర్మానుష్యంగా రోడ్లు, వీధులు 

కరీంనగర్‌ టౌన్‌, మే 12: జిల్లాలో లాక్‌డౌన్‌ను పోలీసులు పటిష్టంగా అమలు చేస్తున్నారు. మొదటి రెండు రోజులు పోలీసులు కొంత చూసీచూడనట్లు వ్యవహరించగా  శుక్రవారం మూడో రోజు కఠినంగానే వ్యవహరించారు. ఉదయం 6 నుంచి 10 గంటల వరకు అన్ని వ్యాపార సంస్థలను తెరచి ఉంచడంతో ప్రజలు ఒక్కసారిగా రోడ్లపైకి వచ్చి వారికి అవసరమైన వస్తువులు, కూరగాయలు కొన్నారు. నిన్నమొన్నటి వరకు 11 గంటల వరకు కొన్ని దుకాణాలు తెరచి ఉంచడం, రోడ్లపై తిరుగడం కనిపించినా పోలీసులు వారికి అవగాహన కల్పించి మూసివేయించారు. శుక్రవారం 10 గంటల నుంచి కచ్చితంగా లాక్‌డౌన్‌ నిబంధనలను అమలులోకి తెచ్చారు. తెరచి ఉంచిన వ్యాపార సంస్థలను మూసివేసి తీవ్రస్థాయిలో హెచ్చరించారు. ఓవైపు లాక్‌డౌన్‌ మరోవైపు రంజాన్‌ సెలవు దినం కావడంతో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. కొవిడ్‌ పరీక్షా కేంద్రాలు, వ్యాక్సినేషన్‌ కేంద్రాలకు ప్రజలు ఎక్కువగా వెళ్లలేదు. ఆర్టీసీ సంస్థ కరీంనగర్‌ రీజియన్‌ పరిధిలోని వివిధ డిపోల ద్వారా ఉదయం 6 నుంచి 10 గంటల వరకు 100 బస్సులను నడిపించింది. పెట్రోల్‌బంకులు యధావిధిగా పనిచేశాయి. 

 

Updated Date - 2021-05-15T05:45:10+05:30 IST