పటిష్టంగా లాక్‌డౌన్

ABN , First Publish Date - 2020-08-10T08:44:58+05:30 IST

జిల్లాలో లాక్‌డౌన్‌ను పోలీసులు పటిష్టంగా అమలు చేశారు. జిల్లా కేం ద్రంతో పాటు పట్టణ ప్రాంతాలలో ఆదివారం ఉదయం నుంచే పోలీసులతో పాటు ప్రత్యేక బలగాలను మొహరించారు.

పటిష్టంగా లాక్‌డౌన్

ఉల్లంఘనదారులపై పోలీసు ప్రత్యేక  నిఘా

బోసిపోయిన నగర వీధులు

బస్టాండ్‌ ఆవరణలో టిఫిన్‌ కోసం బారులు


అనంతపురం క్రైం, ఆగస్టు 9 :  జిల్లాలో లాక్‌డౌన్‌ను పోలీసులు పటిష్టంగా అమలు చేశారు. జిల్లా కేం ద్రంతో పాటు పట్టణ ప్రాంతాలలో ఆదివారం ఉదయం నుంచే పోలీసులతో పాటు ప్రత్యేక బలగాలను మొహరించారు. ప్రజలు కూడా ఎక్కువ శాతం ఇళ్లకే పరిమితమయ్యారు. మరికొందరు అవసరం లేకున్నా నగరంలోకి వస్తుండటంతో వారి వాహనాలను నిలిపి పోలీసులు కౌన్సెలింగ్‌ చేశారు. డీఎస్పీ వీరరాఘవరెడ్డి నేతృత్వంలో నగరంలోని శ్రీకంఠం సర్కిల్‌, సప్తగిరి సర్కిల్‌, టవర్‌క్లాక్‌, పీటీసీ తదితర ప్రధాన కూడళ్లలో పోలీసు వాహనాలతో కలియదిరిగి ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు. 


నగరంలో పోలీసు పటిష్ట నిఘా ఉండటంలో కొన్ని ప్రాంతాలు నిర్మానుష్యంగా మారాయి. నగరంలో ఎక్కడా హోటళ్లు లేకపోవడంతో ఆర్టీసీ బస్టాండ్‌లోని క్యాంటీన్‌ వద్ద బారులు తీరారు. నగరంలోని పీటీసీ ఫ్లైఓవర్‌ మూసివేయడంతో  కాసేపు వాహనాల రద్దీ ఏర్పడి గందరగోళ పరిస్థితి నెలకొంది. కొన్ని ప్రాంతాలలో రోడ్ల మీద యువత తిరుగు తుండటంతో డీఎస్పీ వీరరాఘవరెడ్డితో పాటు కొందరు పోలీసులు లాఠీ ఝుళిపించారు. దీంతో నగరంలో మధ్యాహ్నానికే ప్రధాన కూడళ్లు, రహదారులు, ఫ్ల్లైఓవర్‌ బ్రిడ్జిలు నిర్మానుష్యంగా మారాయి.  

Updated Date - 2020-08-10T08:44:58+05:30 IST