సమ్మెకు సై.. తాడోపేడే తేల్చుకోనున్న ఉద్యోగులు

ABN , First Publish Date - 2022-01-24T23:05:35+05:30 IST

పీఆర్సీపై ఏకపక్ష జీవోలు జారీ చేసిన సర్కారుపై ‘సమ్మె అస్త్రం’ ప్రయోగించేందుకు ఉద్యోగ సంఘాలు సిద్ధమయ్యారు.

సమ్మెకు సై.. తాడోపేడే తేల్చుకోనున్న ఉద్యోగులు

అమరావతి: పీఆర్సీపై ఏకపక్ష జీవోలు జారీ చేసిన సర్కారుపై  ‘సమ్మె అస్త్రం’ ప్రయోగించేందుకు ఉద్యోగ సంఘాలు సిద్ధమయ్యారు. ఫిబ్రవరి 6న అర్ధరాత్రి నుంచి నిరవధిక సమ్మెకు దిగుతున్నట్టు పీఆర్సీ సాధన సమితి స్టీరింగ్ కమిటీ సమ్మె నోటీసు ఇచ్చింది. సీఎస్‌ తరపున జీఏడీ ప్రిన్సిపల్‌ సెక్రటరీ శశిభూషణ్‌కు సమ్మె నోటీసిచ్చారు. కొత్త పీఆర్సీతో ఉద్యోగులకు వచ్చిన నష్టం, పీఆర్సీ జీవోలపై పెద్ద ఎత్తున వస్తున్న అసంతృప్తి దృష్ట్యా ఉద్యోగ సంఘాల నేతలు సమ్మె వైపే మొగ్గు చూపారు. ఫిబ్రవరి 6వ తేదీ అర్ధరాత్రి నుంచి (7వ తేదీ) సమ్మెకు వెళ్లాలని పీఆర్సీ సాధన కమిటీ నిర్ణయించింది. ‘ఈ పీఆర్సీతో ప్రతి ఉద్యోగికీ నష్టమే. దీనికి అంగీకరించేది లేదు’ అని పీఆర్సీ సాధన సమితి తేల్చి చెప్పింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఉద్యోగ, ఉపాధ్యాయ, సచివాలయ, ఎన్‌ఎంఆర్‌, ప్రజా రవాణాతోపాటు ఇతర అన్ని విభాగాలు, శాఖల ఉద్యోగులు సమ్మెకు దిగుతున్నట్లు తెలిపింది.

Updated Date - 2022-01-24T23:05:35+05:30 IST