పెట్రో ధరలు తగ్గించాలి

ABN , First Publish Date - 2021-02-27T05:45:34+05:30 IST

పెట్రోలు, డీజిల్‌, గ్యాస్‌ ధరలు తగ్గిం చాలని వామపక్షాల ఆధ్వర్యంలో ఎమ్మిగనూరులో శుక్రవారం ఆందోళన నిర్వహించారు.

పెట్రో ధరలు తగ్గించాలి
నందవరంలో ఆందోళన చేస్తున్న నాయకులు

  1. వామపక్షాల ఆందోళన  


ఎమ్మిగనూరు, ఫిబ్రవరి 26: పెట్రోలు, డీజిల్‌, గ్యాస్‌ ధరలు తగ్గిం చాలని వామపక్షాల ఆధ్వర్యంలో ఎమ్మిగనూరులో శుక్రవారం ఆందోళన నిర్వహించారు. ఎంజీ పెట్రోల్‌ బంక్‌ వద్ద నాయకులు, కార్యకర్తలు ధర్నా నిర్వహించారు.  రామాంజనేయలు, పంపన్నగౌడ్‌, హనుమంతు, భాగ్యలక్ష్మి, రాజు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పెట్రోలు, డిజిల్‌, గ్యాస్‌ ధరలు పెం చుతూ సామాన్య ప్రజల నడ్డివిరుస్తోందని విమర్శించారు. కేంద్ర ఆర్థిక మంత్రి బడ్జెట్‌ ప్రసంగంలో చేసిన మాటలకు వాస్తవ పరిస్థితులు భిన్నంగా ఉన్నాయన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అంతర్జాతీయంగా ధరలు తగ్గినప్పుడు ప్రయోజనాలను వాహన దారులకు అందించకుండా పెరిగిన ప్పుడు మాత్రం మోపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.  వెంటనే కేంద్రం పెట్రోలు, డిజీల్‌, గ్యాస్‌ ధరలు తగ్గించేలా చర్యలు తీసుకోవాలని లేనిపక్షంలో ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. మాల నరసన్న, రాముడు, వసంతరాజు, లక్ష్మినరసయ్య పాల్గోన్నారు. 


నందవరం: పెట్రోల్‌, డీజీల్‌, నిత్యావసరాల ధరలను తగ్గించాలని శుక్రవారం సీపీఐ అధ్యక్షుడు ముగతి సోమేశ్వరరెడ్డి ఆద్వర్యంలో ధర్నా నిర్వ హించారు. కేంద్ర ప్రభుత్వం రోజు రోజుకు ధరలు పెంచడం సరికాదన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు మెడలు వచ్చి బుద్ధి చెపుతారన్నారు.  గిడ్డయ్య, నాయకులు పాల్గొన్నారు.


కౌతాళం: చమురు ధరలను తగ్గించాలని శుక్రవారం వామపక్షాల ఆధ్వ ర్యంలో నిరసన చేపట్టారు. అంబేడ్కర్‌ కూడలి వద్ద నిరసన తెలిపి నినాదాలు చేశారు. సీపీఎం నాయకులు మల్లయ్య మాట్లాడుతూ అంతర్జాతీయంగా క్రూడ్‌ ఆయిల్‌ ధరలు తగ్గిన సమయంలో కూడా  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పన్నుల భారంతో ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని అన్నారు. లింగన్న, జగదీశ్‌ తదితరులు పాల్గొన్నారు.


 ఆదోని: పెంచిన పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ ధరలను రద్దు చేయాలని సీపీఎం కార్యదర్శి రాధాకృష్ణ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన  తెలిపారు. శుక్రవారం పెట్రోల్‌ బంక్‌ వద్ద నిరసన తెలిపారు. నెల లోపే  గ్యాస్‌ సిలిండర్‌ రూ.వంద, పెట్రోల్‌ రూ.10.11 పెరిగిందన్నారు. అంతర్జాతీయంగా క్రూడ్‌ ఆయిల్‌ ధరలు తగ్గిన సమయంలో కూడా ఇక్కడ పెరుగుతూనే ఉన్నా యన్నారు. ఇప్పటికైనా గ్యాస్‌పై పన్నులు తగ్గించాలని డిమాండ్‌ చేశారు. వెంకటేశ్వర్లు, వెంకప్ప, ప్రసాద్‌, నేతప్ప, మహానంది, గోపాల్‌, లక్ష్మన్న, వీరేష్‌, తిరుమలేష్‌, మల్లికార్జున, రామాంజనేయులు పాల్గొన్నారు. 


ఆలూరు రూరల్‌: పెట్రో ఉత్పత్తులపై ఎక్సైజ్‌ సుంకాల పెంపును కేంద్రం  ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేస్తూ శుక్రవారం సీపీఎం ఆధ్వర్యంలో బళ్లారి రహదారిలోని పెట్రోల్‌ బంక్‌ వద్ద నిరసన చేపట్టారు.  సీపీఎం కార్య దర్శి నారాయణస్వామి, శాకీర్‌ మాట్లాడుతూ కొన్ని నెలలుగా ధరలను పెం చుతున్నారని అన్నారు. పార్టీ హాలహర్వి కార్యదర్శి కృష్ణ, నాయకులు నాగ రాజు, విఠల్‌, డీవైఎఫ్‌ఐ మైన, గోవర్ధన్‌, గోపాల్‌, భాస్కర్‌, అశోక్‌ పాల్గొన్నారు. 


కర్నూలు(న్యూసిటీ): కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టాలని సీపీఐ రాష్ట్ర కార్యవర్గసభ్యుడు రామాంజనేయులు ప్రజలకు పిలుపునిచ్చారు. వామపక్షాల ఆధ్వర్యంలో బుధవారపేట పెట్రోల్‌ బంక్‌ వద్ద శుక్రవారం నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నగర కార్యదర్శి రాజశేఖర్‌, కేశమ్మ, కృష్ణ, చంద్రశేఖర్‌ పాల్గొన్నారు. 


బేతంచెర్ల: పట్టణంలోని పాతబస్టాండులో పెట్రోల్‌, డీజల్‌ ధరల పెంపునకు నిరసనగా సీఐటీయూ, ప్రజాసంఘాలు శుక్రవారం రాస్తారోకో నిర్వహించాయి. వెంటనే ధరలను తగ్గించాలని సీఐటీయూ అధ్యక్ష, కార్యదర్శులు వెంకటేశ్వర్లు, ఎల్లయ్య డిమాండ్‌ చేశారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపాలని, లేదంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు రామకృష్ణ, కలాం, సంజీవ, బాలయ్య, గుంతకల్లు బాషా, మద్దయ్య తదితరులు పాల్గొన్నారు.  


డోన్‌(రూరల్‌): పెట్రోల్‌, డీజిల్‌ ధరలను తగ్గించాలని సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి రంగనాయుడు, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు సుంకయ్య డిమాండ్‌ చేశారు. పెరుగుతున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలకు నిరసనగా గుత్తి రోడ్డులో సీపీఐ, ఏఐటీయూసీ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించా రు. నాయకు లు నక్కి శ్రీకాంత్‌, సుగుణమ్మ, అబ్బాస్‌, పుల్లయ్య, చాంధినీ పాల్గొన్నారు. 


పత్తికొండ రూరల్‌: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సామాన్యుల జీవితాలో చెలగాటం ఆడుతున్నాయని ఏపీ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రయ్య మండిపడ్డారు. పత్తికొండ పట్టణంలోని సీపీఐ కార్యాలయం నుంచి నాలుగు స్థంభాల కూడలి వరకు ఆటోకు తాడును కట్టి లాగుతూ శుక్రవారం నిరసన తెలిపారు. అనంతరం పట్టణకార్యదర్శి సురేంద్రకుమార్‌ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. సీపీఐ మండల కార్యదర్శి రాజాసాహెబ్‌, జిల్లా సమితి సభ్యులు కారన్న, కృష్ణ, తిమ్మయ్య, నాయకులు నెట్టకంటయ్య, సుంకన్న, రంగన్న, మాదన్న, పులికొండ పాల్గొన్నారు. 


గూడూరు: పెంచిన పెట్రోల్‌, డీజిల్‌, వంట గ్యాస్‌ ధరలను వెంటనే తగ్గించాలని సీపీఎం ప్రాంతీయ కార్యదర్శి జె.మోహన్‌ డిమాండ్‌ చేశారు. శుక్రవారం గూడూరు పట్టణంలోని పెట్రోల్‌ బంకు దగ్గర సీపీఎం, సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. కార్యక్రమంలో సీఐటీయూ మండల నాయకులు రాజు, సీపీఎం నాయకులు దానమన్న, రంగన్న, రాజు, సీఐటీయూ నాయకులు రాజు, రవి, సుధాకర్‌, హమాలీ కార్మికులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-02-27T05:45:34+05:30 IST