తాటిచెట్టు నుంచి పడి గీత కార్మికుడి మృతి

ABN , First Publish Date - 2021-04-19T06:05:35+05:30 IST

మండలంలోని ఖుదాభక్షిపల్లి గ్రామానికి చెందిన గీత కార్మికుడు పంతంగి వెంకటయ్య(49) వెంకెపల్లి గ్రామ శివారులోని తాటిచెట్లకు కల్లుగీసి జీవనం సాగిస్తున్నాడు.

తాటిచెట్టు నుంచి పడి గీత కార్మికుడి మృతి

మర్రిగూడ, ఏప్రిల్‌ 18 : మండలంలోని ఖుదాభక్షిపల్లి గ్రామానికి చెందిన గీత కార్మికుడు పంతంగి వెంకటయ్య(49) వెంకెపల్లి గ్రామ శివారులోని తాటిచెట్లకు కల్లుగీసి జీవనం సాగిస్తున్నాడు. ఈక్రమంలో రోజుమాదిరిగా ఆదివారం తాటిచెట్లు ఎక్కి కల్లు గీస్తుండగా ప్రమాదవశాత్తు జారి కిందపడి అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడికి భార్యతో పాటు  కుమారుడు, కుమార్తెలు ఉన్నారు. భార్య యాదమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ క్రాంతికుమార్‌ తెలిపారు.

శాలిగౌరారం పీఎ్‌సలో మిస్సింగ్‌ కేసు నమోదు
శాలిగౌరారం, ఏప్రిల్‌ 18 :
స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఆదివారం మిస్సింగ్‌ కేసు నమోదైంది. మండలంలోని పెర్కకొండారం గ్రామానికి చెందిన కంకణాల రాజిరెడ్డి(74) ఈ నెల 15న ఇంటి నుంచి కనిపించకుండా పోయాడు. కుటుంబ సభ్యులు బంధువులను సంప్రదించినా ఆచూకీ లభించలేదు. దీంతో రాజిరెడ్డి మనువడు వినీత్‌రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్‌ఐ వై.హరిబాబు తెలిపారు.

 ఖైదీ మృతిపై జిల్లా జైలు అధికారి విచారణ
దేవరకొండ, ఏప్రిల్‌ 18 :
కొండమల్లేపల్లి మండలంలోని హైదరాబాద్‌ రోడ్డులో ఈ నెల 17న పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన ఖైదీ వెంకటయ్య మృతిపై జిల్లా జైలు అధికారి దేవులనాయక్‌ దేవరకొండ సబ్‌జైల్‌లో ఆదివారం విచారించారు. వెంకటయ్య ఐదేళ్ల  క్రితం భార్యను హత్య చేయడంతో కోర్టు జీవిత ఖైదీ విధించింది. దేవరకొండ జైలులో శిక్ష అనుభవిస్తున్న అతడు జైలుకు సంబంధించిన పెట్రోల్‌ బంక్‌లో విధులు నిర్వహిస్తూ ఈనెల 17న కొండమల్లేపల్లిలో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వెంకటయ్య మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించినట్లు దేవరకొండ సబ్‌జైల్‌ అధికారి కుటుంబరాజు తెలిపారు. వెంకటయ్య మృతిపై జిల్లా జైలు అధికారి దేవులనాయక్‌ ఆదివారం విచారించినట్లు సబ్‌జైలర్‌ కుటుంబ రాజు తెలిపారు.

Updated Date - 2021-04-19T06:05:35+05:30 IST