మెరుగైన బోధనకు కృషి

ABN , First Publish Date - 2021-01-21T06:15:53+05:30 IST

డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ యూనివర్సిటీలో మెరుగైన బోధనకు కృషి చేయనున్నట్లు నూతన వైస్‌చాన్సలర్‌ ప్రొఫెసర్‌ నిమ్మ వెంకటరావు తెలి పారు. వీసీగా బుధవారం ఆయన బాధ్యతలు స్వీకరిం చారు.

మెరుగైన బోధనకు కృషి

అలసత్వం ప్రదర్శిస్తే ఉపేక్షించేది లేదు 

బీఆర్‌ఏయూ వీసీ ప్రొఫెసర్‌ వెంకటరావు 

బాధ్యతల స్వీకరణ

ఎచ్చెర్ల, జనవరి 20 : డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ యూనివర్సిటీలో మెరుగైన బోధనకు కృషి చేయనున్నట్లు నూతన వైస్‌చాన్సలర్‌ ప్రొఫెసర్‌ నిమ్మ వెంకటరావు తెలి పారు. వీసీగా బుధవారం ఆయన బాధ్యతలు స్వీకరిం చారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ... బోధనలో అలసత్వం ప్రదర్శిస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ‘సమాజానికి ఉపయోగపడేలా నిరంతర శోధనతోనే వర్సిటీలకు గుర్తింపు లభిస్తుంది. వర్సిటీలు సమాజాన్ని ప్రతిబింబించేలా ఉండాలి. సమస్యల పరిష్కారం దిశగా  ముందుకు సాగాలి. జాతీయ విద్యా విధానంలో భాగంగా విద్యార్థులు ఏ కోర్సునైనా అభ్యసించేందుకు వీలుంది.  అవసరమైన కొత్త కోర్సులు ప్రారంభిస్తాం. ప్రస్తుతం ఉన్న కోర్సులను బలోపేతం చేసి, విద్యార్థులను ఆకర్షించేలా  తీర్చిదిద్దాల్సి ఉంది. వర్సిటీలోని బోధన, బోధనేతర సిబ్బంది సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా. ఇప్పటికే నాక్‌ గుర్తింపునకు దరఖాస్తు చేశారు. ఇంకా కమిటీ రావాల్సి ఉంది. బయోమెట్రిక్‌ హాజరును తప్పనిసరి చేస్తాం. సిబ్బంది కోసం కొత్తగా వెల్ఫేర్‌ ఫండ్‌ను ఏర్పాటు చేస్తున్నాం.  విద్యారంగంలో సవాళ్లను సమర్థంగా ఎదు ర్కొని ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతాం’ అని వీసీ తెలిపారు.

 వర్సిటీ జర్నల్‌ ఆవిష్కరణ 

అంబేడ్కర్‌ వర్సిటీ జర్నల్‌ను వీసీ నిమ్మ వెంకటరావు ఆవిష్కరించారు. ముందుగా ఆయన సతీసమేతంగా అరసవల్లి సూర్యనారాయణ స్వామిని దర్శిం చుకున్నారు. అనంతరం వర్సి టీకి చేరుకుని అం బేడ్కర్‌ విగ్ర హానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తరువాత తన చాంబర్‌కు వెళ్లి వీసీగా బాధ్యతలు స్వీకరించారు. ఆయనను వర్సిటీ రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ కె.రఘుబాబు, ప్రిన్సిపాళ్లు ప్రొఫెసర్‌ టి.కామరాజు, ప్రొఫెసర్‌ పి.సుజాత, సీడీసీ డీన్‌ ప్రొఫెసర్‌ బి.అడ్డయ్య, పూర్వపు వీసీ ప్రొఫెసర్‌ హనుమంతు లజపతిరాయ్‌, విశ్రాంత ప్రొఫెసర్‌ పి.చిరంజీ వులు, ఉపాధ్యాయ సంఘాలు, వర్సిటీ బోధన, బోధనేతర సిబ్బంది కలిసి అభినందించారు.  

కుప్పిలి నుంచి ప్రస్థానం

ఎచ్చెర్ల మండలం కుప్పిలి గ్రామంలో రైతు కుటుంబానికి చెందిన కన్నమ్మ, రామస్వామిరెడ్డిలకు నిమ్మ వెంకటరావు జన్మించారు. స్వగ్రామమైన కుప్పిలిలో 7వ తరగతి వరకు చదువుకున్నారు. మురపాక హైస్కూల్‌లో 8, 9, 10 తరగతులు, పొందూరు ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఇంటర్మీడియట్‌, శ్రీకాకుళం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బీకాం డిగ్రీ చదివారు. ఆంధ్రా యూనివర్సిటీలో ఎంఏ ఎడ్యుకేషన్‌, ఎంఏ ఫిలాసఫీ, పీహెచ్‌డీ పూర్తిచేశారు. వెంకటరావు భార్య విజయలక్ష్మి ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా పని చేస్తున్నారు. వీరికి ఇద్దరు కుమారులు. ప్రస్తుతం విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు.  

Updated Date - 2021-01-21T06:15:53+05:30 IST