పోరుబాట

ABN , First Publish Date - 2021-03-03T06:03:15+05:30 IST

యుద్ధకాలమిది చావోరేవోతేల్చే సమయమిది ఉద్యమాలే ఊపిరిగా సాధించుకున్న ఆంధ్రుడిహక్కు...

పోరుబాట

యుద్ధకాలమిది

చావోరేవోతేల్చే సమయమిది


ఉద్యమాలే ఊపిరిగా

సాధించుకున్న ఆంధ్రుడిహక్కు

మూడుపదులకే

హరింపబడుతున్న క్షణాలివి


హక్కులకోసం నిలబడటమంటే

అమ్మకోసమే నిలబడటమని

గుర్తెరిగి

భవితని సవాలుచేసే

చర్యల్ని తుదముట్టించేందుకు


పౌరుషాల ఉగ్గుపాలుపట్టినోళ్ళం

ఆత్మాభిమానానికై ఎగిసిపడేటోళ్లం


విశాఖ ఉక్కుతో బంధం

తల్లీబిడ్డల అనుబంధమంటూ


ఉక్కుపిడికిలి బిగించి

పోరుఢంకా మ్రోగించి

కథనుమార్చగా కదంతొక్కుతూ

పథం మార్చగా పదంపాడుతూ

ఓకే త్రాటిపై పోరుబాటలో

పయనిద్దాం


లక్ష్యం ముద్దాడగా

ఆంధ్రుడి చిరుహాసం

తొలకరిజల్లై కురిసేవరకు

అలుపు లేకుండా పోరాడదాం

వేమూరి శ్రీనివాస్

తాడేపల్లిగూడెం

Updated Date - 2021-03-03T06:03:15+05:30 IST