మత్తుపై సమరం

ABN , First Publish Date - 2022-02-10T04:10:44+05:30 IST

సరాదగా మొదలై అలవాటుగా మారి యువతను వ్యవసనానికి బాని సలుగా మారుస్తున్న గంజాయి, ఇతర మత్తు పదార్థాలను నిరోధించేం దుకు అధికార యంత్రాంగం రంగంలోకి దిగింది.

మత్తుపై సమరం
కుమరం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలో అవగాహన సదస్సులో మాట్లాడుతున్న కలెక్టర్‌ (ఫైల్‌)

- రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో కదిలిన యంత్రాంగం
- గుడుంబా, ఇతర మత్తుపదార్థాలపై నజర్‌
- యువతకు అవగాహన కల్పించేందుకు కార్యాచరణ
- గంజాయి సాగు చేస్తే రైతుబంధు నిలిపివేత

(ఆంధ్రజ్యోతి, ఆసిఫాబాద్‌)
సరాదగా మొదలై అలవాటుగా మారి యువతను వ్యవసనానికి బాని సలుగా మారుస్తున్న గంజాయి, ఇతర మత్తు పదార్థాలను నిరోధించేం దుకు అధికార యంత్రాంగం రంగంలోకి దిగింది. ప్రభుత్వ ఆదేశాలతో డ్రగ్స్‌ నియంత్రణ కోసం పోలీసులు, ఎక్సైజ్‌, పంచాయతీ రాజ్‌శాఖలు సమన్వయంతో గ్రామాల్లో మత్తు పదార్థాల నిరోధానికి చర్యలు ప్రారం భించేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. కుమరం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలోని 15 మండలాలు 334 గ్రామ పంచాయతీలు, 1000పైగా ఆవాసాల్లో మత్తు పదార్థాలను అరికట్టేందుకు అవగాహన కార్యక్రమాల ను చేపట్టాలని నిర్ణయించారు. ఇందులో భాగంగానే జిల్లా ఎక్సైజ్‌ శాఖ ఆధ్వర్యంలో మూడు రోజుల క్రితం జిల్లా కేంద్రంలో అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సదస్సులో భాగంగా గంజాయి, గుడుంబాతో పాటు ఇతర మత్తు పదార్థాల నిరోధంపై అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. వారం పది రోజుల్లోగా ఇందుకు సంబంధించి స్పష్టమైన కార్యాచరణ సిద్ధం చేసుకోవాలని జిల్లా కలెక్టర్‌ పోలీస్‌, ఎక్సైజ్‌, పంచాయతీ రాజ్‌ శాఖలను ఆదేశించారు. దీంతో త్వరలోనే ఇందుకు సంబంధించిన కార్యాచరణ ఆచరణలో పెట్టేందుకు అధికార యంత్రాం గం సన్నద్ధమవుతోంది.

- జిల్లాలో డ్రగ్స్‌ విక్రయాల ఆనవాళ్లు..
కుమరం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలో డ్రగ్స్‌ విక్రయాలు, వినియోగం ఆనవాళ్లు ఇప్పటి వరకు బయటపడ లేదు. కాగా కొంత కాలం క్రితం హైదరాబాద్‌ నుంచి వచ్చిన కొంత మంది కొకైన్‌ వంటి మత్తు పదార్థాల ను విక్రయించే ప్రయత్నం చేసినట్టు ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో అలాంటి అనుమానితుల కదలికలపైన నిఘా ముమర్మం చేయాలని నిర్ణయించారు. జిల్లాలో ప్రధానంగా గంజాయి సాగు వినియోగంతో పాటు గుడుంబా తయారీ ప్రధాన సామాజిక సమస్యగా కొనసాగుతు న్నట్టు గుర్తించారు. జిల్లాలోని సింహభాగం ఆవాసాలు ఆదివాసీ గిరిజన గూడాలు కావడంతో సంప్రదాయంగా ఈ రెండింటిన వినియోగించడం గతకొన్ని తరాలుగా కొనసాగుతోంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం గుడుంబా తయారీని నిరోధించేందుకు గతంలో పటిష్ఠమైన ప్రణాళికతో తయారీ దారులను ఆ వృత్తి మాన్పించి ప్రధాన స్రవంతిలోకి తెచ్చేందుకు ప్రత్యేక పునరావాస చర్యలను ప్రారంభించింది. 2016 నుంచి 2021 డిసెంబరు నాటికి ఇలా వందలాది మంది గుడుంబా తయారీ దారులను గుర్తించి వారికి పునరావాసం కింద ఆర్థిక సహాయం అందించి ఇతర వృత్తుల్లో స్థిరపడేలా చేశారు. దీంతో గుడుంబా తయారీ 80 శాతం మేర తగ్గినట్టు గుర్తించారు. అయితే ఆదివాసీ గొండు గ్రామాల్లో కొన్ని తరాలుగా గంజా యి మొక్కల పత్రాలను తమ కుల దేవతలకు నైవేద్యంగా సమర్పించే ఆచారం కొనసాగుతున్న నేపథ్యంలో చాలా గ్రామాల్లో ఆదివాసీలు ఒకటిరెండు మొక్కలు సాగు చేసుకునే వారని ఆ సామాజిక వర్గానికి చెందిన నేతలు చెబుతున్నారు. అయితే ఈ క్రమంలో బయటి నుంచి వచ్చిన కొంత మంది స్మగ్లర్లు ఆదివాసీల అమాయకత్వాన్ని ఆసరా చేసుకొని డబ్బులు ఎర చూపి గంజాయిని వాణిజ్య పద్ధతిలో సాగు చేయిస్తున్న పరిస్థితి మొదలైందని, ఈ కారణంగా గడిచిన కొద్ది సంవత్స రాలుగా జిల్లాలో గంజాయి మహామ్మారిలా విస్తరించిందని అంచనా వేశారు. ఇందుకు గతేడాది నమోదైన కేసులే తార్కాణంగా చూపుతు న్నారు. రాష్ట్రంలో అత్యధికంగా గంజాయి సంబంధిత కేసులు నమోదు జిల్లాల్లో కుమరం భీం జిల్లా నాల్గవ స్థానంలో ఉండడం పరిస్థితి తీవ్రతంగా అద్దం పడుతోంది. గత ఏడాది అధికారిక గణాంకాల ప్రకా రం గంజాయి సాగు చేయడం, రవాణా చేయటం వంటి కేసుల్లో మొత్తం 55 మందిపై కేసులు నమోదు అయినట్టు పోలీసులు వెల్లడిం చారు. ఇటీవల ముఖ్యమంత్రి గంజాయి, డ్రగ్స్‌ వినియోగంపై ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగం మత్తు పదార్ధాల నియంత్రణపై కార్యాచరణ ప్రారంభించింది.

- గంజాయి సాగుదారులపై కొరడా..
గంజాయి నియంత్రణలో భాగంగా అధికార యంత్రాంగం కఠిన చర్యలు చేపట్టాలని నియంత్రించిన నేపథ్యంలో జిల్లా కలెక్టర్‌ సాగుదారులపై కొరడా ఝలిపించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లాలో ని ఏ గ్రామంలోనైనా రైతులు గంజాయి సాగు చేస్తే వారికి రైతు బంధు నిలిపివేయడంతో పాటు సంబంధిత గ్రామంలోని రైతులందరికి రైతు బంధును రాకుండా నిలిపివేసేలా చర్యలు తీసుకోబోతున్నట్టు ప్రకటించ డం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. సాదారణంగా జిల్లాలో అటవీ ప్రాంతాల్లోని మారుమూల పంట చేలల్లోనే గంజాయి సాగు జరుగుతున్నట్టు చెబుతున్నారు. అదీ కూడా స్వల్ప సంఖ్యలో మొక్కలు నాటి వినియోగం విక్రయాలు జరుపుతున్నట్టు నిర్ధారించటంతో సంబం ధిత మండల వ్యవసాయాధికారులు, వ్యవసాయ విస్తరణ అధికారులను గంజాయి సాగును నిరోధించేందుకు బాధ్యులను చేయాలని నిర్ణయిం చారు. రైతులు గంజాయి మొక్కలు వేయకుండా సీజన్‌ ప్రారంభం నుం చే విస్తరణ అధికారులు రైతుల వద్దకు వెళ్లి అవగాహన కల్పించడంతో పాటు స్వయంగా పంట చేలను తనిఖీ చేస్తుండాలని ఇప్పటికే ఆదేశిం చారు. మరో వైపు త్వరలో నిర్వహించే గ్రామసభల్లోనూ గంజాయి సాగు జరుగకుండా తీర్మానాలు చేయించేందుకు పంచాయతీరాజ్‌శాఖ చర్యలు చేపట్టాలని స్పష్టంగా ఆదేశించారు. ముఖ్యంగా గ్రామాల్లో గంజాయి, గుడుంబా, డ్రగ్స్‌ వంటి అంశాలపై యువతకు అవగాహన పరిచేలా ప్రధాన కూడల్లు, గ్రామ పంచాయతీ కార్యాలయాల వద్ద ఫ్లెక్సీలు, బ్యానర్లను ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు.

Updated Date - 2022-02-10T04:10:44+05:30 IST