Abn logo
Sep 27 2021 @ 00:34AM

కేంద్ర ప్రభుత్వం దిగొచ్చేవరకు పోరాటాలు

సమావేశంలో మాట్లాడుతున్న మాజీ కార్పొరేటర్‌ కె.విమల

మాజీ కార్పొరేటర్‌ కె.విమల

ఉక్కుటౌన్‌షిప్‌, సెప్టెంబరు 26: విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం విరమించుకున్నట్టు ప్రకటించేంత వరకు పోరాటాలు చేస్తామని మాజీ కార్పొరేటర్‌ కె.విమల అన్నారు. ప్లాంట్‌ సీడబ్ల్యూసీ-1లో ఆదివారం జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ప్లాంట్‌ పరిరక్షణ కోసం వచ్చే నెల 7న మహిళలు పాదయాత్రగా వెళ్లి ఉక్కు పరిపాలన భవనాన్ని ముట్టడిస్తామన్నారు. లక్షలాది మందికి జీవనోపాధి కల్పిస్తూ,  రాష్ట్రంలో అగ్రగామి సంస్థగా నిలిచిన విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను కార్పొరేట్‌లకు అప్పగించేందుకు కుట్ర జరుగుతున్నదన్నారు. కేంద్ర ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తున్నదని ఆరోపించారు. ప్రైవేటీకరణ విషయంలో ఏమాత్రం ముందడుగు వేసినా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో వరలక్ష్మి, వేణు, దీప్తి పాల్గొన్నారు.