Advertisement
Advertisement
Abn logo
Advertisement

అద్దెకు ఉంటున్న కుర్రాడు.. మాట్లాడేందుకు రాత్రి పదింటికి వెళ్లిన యజమాని.. గదిలో కనిపించిన దృశ్యం చూసి..

ఐటీఐ చదువుకుంటున్న ప్రవీణ్ అనే యువకుడు బీహార్‌లోని రాంచీలో ఓ ఇంట్లో అద్దెకుంటున్నాడు. ప్రవీణ్‌తో మాట్లాడేందుకు శుక్రవారం రాత్రి పది గంటలకు ఇంటి యజమాని అతని గదికి వెళ్లాడు. అయితే అక్కడ కనిపించిన దృశ్యం చూసి షాకయ్యాడు. అక్కడ ప్రవీణ్ ఫ్యాన్‌కు ఉరేసుకుని కనిపించాడు. దాంతో షాకైన ఇంటి యజమాని వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు.


ఘటన జరిగిన ప్రదేశానికి వచ్చిన పోలీసులు దర్యాఫ్తు ప్రారంభించారు. అక్కడ ఓ సూసైడ్ నోట్‌ను, ఒక ఉంగరాన్ని కనుగొన్నారు. ఆ లేఖలో `గుడ్‌బయ్` అని ఓ అమ్మాయి పేరు రాసింది. దానిపై ఉంగరం ఉంది. వీటి ఆధారంగా లవ్ ఫెయిల్యూర్ వల్లే ప్రవీణ్ ఆత్మహత్య చేసుకుని ఉంటాడని పోలీసులు ప్రాథమిక నిర్థారణకు వచ్చారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టమ్ కోసం తరలించారు. ప్రవీణ్ లేఖలో పేర్కొన్న యువతి కోసం గాలిస్తున్నారు.  

Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement