ఇంటర్‌ ఫలితాల్లో విద్యార్థుల ప్రతిభ

ABN , First Publish Date - 2021-10-25T06:25:11+05:30 IST

గత నెల సెప్టెంబరులో జరిగిన ఇంటర్మిడియట్‌ పబ్లిక్‌ పరీక్షా పలితాల్లో ఎం.ఎ్‌స.ఆర్‌ బాలికల జూనియర్‌ కళాశాలకు చెందిన జనిగొర్ల సురేఖ ఉత్తమ ఫలితాలు సాధించి ప్రతిభ కనబరిచారు.

ఇంటర్‌ ఫలితాల్లో విద్యార్థుల ప్రతిభ
కందుకూరులో విద్యార్థులకు అభినందనందిస్తున్న ప్రిన్సిపాల్‌

కనిగిరి, అక్టోబరు 24: గత నెల సెప్టెంబరులో జరిగిన ఇంటర్మిడియట్‌ పబ్లిక్‌ పరీక్షా పలితాల్లో ఎం.ఎ్‌స.ఆర్‌ బాలికల జూనియర్‌ కళాశాలకు చెందిన జనిగొర్ల సురేఖ ఉత్తమ ఫలితాలు సాధించి ప్రతిభ కనబరిచారు. జూనియర్‌ ఇంటర్‌ ఎంపీసీ ఇంగ్లీషు మీడియం గ్రూపులో 470 మార్కులకు గాను 458 మార్కులు సాధించి పట్టణంలో మొదటి ర్యాంకు సాధించింది. రాష్ట్రస్థాయిలోనూ 8వ స్థానంలో నిలిచింది. విద్యార్థిని సురేఖాను మాగుంట చారిటబుల్‌ ట్రస్టు సలహాదారు డి కృష్ణారెడ్డి, ప్రిన్సిపాల్‌ టి.వెంకటరెడ్డి, కళాశాల అద్యాపక బృందం ఆదివారం అభినందించారు. 

పామూరు : ఆదివారం విడుదలైన జూనియర్‌ ఇంటర్‌ ఫలితాల్లో పామూరులోని అక్షర జూనియర్‌  కళాశాల విద్యార్థులు ర్యాంకులు సాధించారు. ఈ  ఫలితాల్లో రొంపిచర్ల మహామున్నిసా బైపీసీ ఇంగ్లీషు మీడియం విభాగంలో 440కు గాను 433 మార్కులతో రాష్ట్రస్థాయిలో రెండవ ర్యాంకు సాఽధించింది. దుగ్గిరెడ్డి అపూర్వ ఎంపీసీ ఇంగ్లీషు మీడియం విభాగంలో 470కు గాను 455 మార్కులతో మండల స్థాయి ప్రధమ ర్యాంకు, సీఈసీ విభాగంలో షేక్‌ దిల్షాద్‌ 500 మార్కులకు గాను 451 మార్కులతో మండల స్థాయి ర్యాంకులు సాఽధించినట్లు అక్షర కళాశాల ప్రిన్సిపాల్‌ అండ్‌ కరస్పాండెంట్‌ కదిరి బాబురంగారావు తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్రస్థాయి, మండలస్థాయి ర్యాంకులు సాధించిన విద్యార్దులకు మిఠాయిలు తినిపించి అభినందించారు. 

కందుకూరు : ఇంటర్మీడియట్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ ఫలితాలలో బిఆర్‌ ఆక్స్‌ఫర్డ్‌ ఐఐటి అండ్‌ నీట్‌ అకాడమీ విద్యార్థులు విశేష ప్రతిభ కనబరిచారని విద్యాసంస్థల ప్రిన్సిపాల్‌ అబ్బూరి వెంకటేశ్వర్లు ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపీసీ విభాగంలో వి.జాహ్నవి, సుహానా పర్వీన్‌లు 470కి 463 మార్కులు సాధించారు. ఆర్‌వీ.సాయిదుర్గ, జి.శ్రావణ్‌లు 461 మార్కులు, పి.అనునేహా, టి.సాయిహర్షితలు 460 మార్కులు సాధించారన్నారు. బైపీసీ విభాగంలో ఎస్‌.కావ్య 440కి 432 మార్కులు సాధించగా ఎస్‌కే సబియా 430 మార్కులు సాధించినట్లు తెలిపారు. అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థినీ విద్యార్థులను ఆక్స్‌ఫర్డ్‌ విద్యాసంస్థల ఛైర్మన్‌ ఉన్నం భాస్కరరావు, కరస్పాండెంట్‌ బండి వెంకటేశ్వర్లు, డైరక్టర్లు బెజవాడ నరేంద్రబాబు, బాలభాస్కరరావు తదితరులు అభినందించారు.

Updated Date - 2021-10-25T06:25:11+05:30 IST