విద్యార్థి సంఘ నాయకులను విడుదల చేయాలి

ABN , First Publish Date - 2021-07-20T13:46:14+05:30 IST

అక్రమంగా అరెస్టు చేసిన..

విద్యార్థి సంఘ నాయకులను విడుదల చేయాలి

టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్‌ అరవిందబాబు


నరసరావుపేట టౌన్‌: అక్రమంగా అరెస్టు చేసిన విద్యార్థి సంఘ నాయకులను వెంటనే విడుదల చేయాలని టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్‌ చదలవాడ అరవిందబాబు డిమాండ్‌ చేశారు. జాబ్‌లెస్‌ క్యాలెండర్‌ రద్దు చేయాలని కోరుతూ సోమవారం ఛలో తాడేపల్లికి బయలు దేరిన నరసరావుపేట పార్లమెంట్‌ టీఎన్‌ఎస్‌ఎఫ్‌ అధ్యక్షుడు కూరపాటి హనుమంతురావు, తెలుగు యువత నాయకులను అరెస్ట్‌ చేసి నరసరావుపేట రెండవ పట్టణ పోలీస్‌ స్టేషన్‌లో ఉంచారు. మరికొంత మందిని గృహనిర్భంధం చేశారు. సీఎం కార్యాలయం ముట్టడికి చేస్తారనే సమాచారంతో నరసరావుపేట టీడీపీ కార్యాలయం వద్ద పోలీసులు మోహరించారు. డాక్టర్‌ అరవిందబాబు మాట్లాడుతూ పాదయాత్రలో ఇచ్చిన హామీనే నిరుద్యోగులు అడుగుతున్నారని, అరెస్టు చేసిన తెలుగు యవత, టీఎన్‌ఎస్‌ఎఫ్‌ విద్యార్థులను, అఖిపక్ష నాయకులను వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. 


రొంపిచర్ల: మండలంలోని గోగులపాడు గ్రామానికి చెందిన టీఎన్‌ఎస్‌ఎఫ్‌ నాయకుడు అల్లూరి సుధాకర్‌ బాబును రొంపిచర్ల పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. కేసులతో ఉద్యమాన్ని ఆపలేరని, కొత్త జాబ్‌ క్యాలెండర్‌ను విడుదల చేయాలని తెలిపారు.  సొంత పూచీకత్తుపై సాయంత్రం అతన్ని విడుదల చేశారు. 

Updated Date - 2021-07-20T13:46:14+05:30 IST