జూలైలోనూ స్టూడెంట్‌ వీసా స్లాట్లు

ABN , First Publish Date - 2021-06-19T07:33:05+05:30 IST

అమెరికా స్టూడెంట్‌ వీసా ఆశిస్తున్న విద్యార్థులకు శుభవార్త..! ఈ నెల 14 న ప్రారంభమైన వీసాల అపాయింట్‌మెంట్‌ దరఖాస్తు ల నేపథ్యంలో.. వెబ్‌సైట్‌పై భారం పడి.. పదేపదే రీఫ్రెష్‌

జూలైలోనూ స్టూడెంట్‌ వీసా స్లాట్లు

విద్యార్థుల్లో కంగారు నేపథ్యంలో అమెరికా ఎంబసీ ప్రకటన


న్యూఢిల్లీ, జూన్‌ 18: అమెరికా స్టూడెంట్‌ వీసా ఆశిస్తున్న విద్యార్థులకు శుభవార్త..! ఈ నెల 14 న ప్రారంభమైన వీసాల అపాయింట్‌మెంట్‌ దరఖాస్తు ల నేపథ్యంలో.. వెబ్‌సైట్‌పై భారం పడి.. పదేపదే రీఫ్రెష్‌ కొట్టడం వల్ల ఖాతాలు 72 గంటల పాటు బ్లాక్‌ అవుతున్న విషయం తెలిసిందే. విద్యార్థులంతా ఒకేసారి లాగిన్‌ అవుతుండడంతో ఈ పరిస్థితి నెలకొందని అమెరికా ఎంబసీ ట్విటర్‌లో తెలిపింది. ‘‘విద్యార్థులు ఆందోళన చెందవద్దు. జూలైలోనూ వీసా అపాయింట్‌మెంట్లు ఉంటాయి. కొవిడ్‌ నేపథ్యంలో 25ు సిబ్బందితోనే అపాయింట్‌మెంట్ల ప్రక్రియను కొనసాగిస్తున్నాం. త్వరలో 40ు సిబ్బంది అందుబాటులోకి వస్తారు’’ అని వివరించింది. వీసాలు పొందిన విద్యార్థులను తరగతు ల ప్రారంభానికి నెల రోజుల ముందు నుంచి అమెరికాలోకి అనుమతిస్తామని వెల్లడించింది. వారు ప్రయాణానికి 72 గంటల ముందు తీసుకున్న ఆర్టీపీసీఆర్‌ నెగటివ్‌ రిపోర్టు చూపించాల్సి ఉంటుందని, అమెరికాకు వచ్చాక ఆర్టీపీసీఆర్‌ టెస్టు చేయించాలని సూచించింది.

Updated Date - 2021-06-19T07:33:05+05:30 IST