సీఎంఆర్‌ఎఫ్‌కు 2.2 లక్షలిచ్చిన ఇంటర్‌ విద్యార్థి

ABN , First Publish Date - 2020-04-09T09:24:56+05:30 IST

కరోనా కట్టడిలో ప్రభుత్వం చేస్తున్న పోరాటానికి మద్దతుగా ఇంటర్‌ విద్యార్థి ప్రణవ్‌ సాయి జాస్తి రూ.2.20 లక్షలు విరాళంగా ఇచ్చాడు. అతడు స్వయంగా ఆర్ట్‌ ఎగ్జిబిషన్‌ నిర్వహించి, ఈ డబ్బును సేకరించడం గమనార్హం. ప్రణవ్‌ బుధవారం మంత్రి కేటీఆర్‌ను కలిసి చెక్కును అందజేశాడు. చిన్న వయసులోనే సేవ చేయడం, పలువురికి

సీఎంఆర్‌ఎఫ్‌కు 2.2 లక్షలిచ్చిన ఇంటర్‌ విద్యార్థి

  • స్వయంగా ఆర్ట్‌ ఎగ్జిబిషన్‌ నిర్వహించి నిధుల సేకరణ
  • కేటీఆర్‌కు చెక్కు అందజేత
  • ప్రణవ్‌ను అభినందించిన మంత్రి
  • కోటి విలువైన వైద్య సామగ్రిని అందజేసిన రెయిన్‌ బో
  • ఆప్టిమస్‌ డ్రగ్స్‌ రూ. 25 లక్షలు విరాళం
  • సార్క్‌ ఇండియా రూ. 20 లక్షలు
  • రూ. 12 లక్షలిచ్చిన టీకేఆర్‌ ఎడ్యుకేషనల్‌ సొసైటీ


(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌)

కరోనా కట్టడిలో ప్రభుత్వం చేస్తున్న పోరాటానికి మద్దతుగా ఇంటర్‌ విద్యార్థి ప్రణవ్‌ సాయి జాస్తి రూ.2.20 లక్షలు విరాళంగా ఇచ్చాడు. అతడు స్వయంగా ఆర్ట్‌ ఎగ్జిబిషన్‌ నిర్వహించి, ఈ డబ్బును సేకరించడం గమనార్హం. ప్రణవ్‌ బుధవారం మంత్రి కేటీఆర్‌ను కలిసి చెక్కును అందజేశాడు. చిన్న వయసులోనే సేవ చేయడం, పలువురికి ఆదర్శంగా నిలవడంతో అతన్ని కేటీఆర్‌ అభినందించారు. కరోనాపై పోరుకు రెయిన్‌ బో చిల్డ్రన్స్‌ ఆస్పత్రి రూ.కోటి విలువైన పీపీఈ కిట్లను ప్రభుత్వానికి అందజేసింది. ఆప్టిమస్‌ డ్రగ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ రూ.25 లక్షలు, సార్క్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ రూ.20 లక్షల చొప్పున సీఎంఆర్‌ఎఫ్‌కు విరాళం ప్రకటించాయి. ఈసీఐఎల్‌ రూ. 23.25 లక్షలిచ్చింది. పీఎం కేర్స్‌ ఫండ్‌కు రూ.2.6 కోట్లు అందజేసినట్లు ఆ సంస్థ తెలిపింది. టీకేఆర్‌ ఎడ్యుకేషనల్‌ సొసైటీ తరఫున మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి రూ.12 లక్షల చెక్కును కేటీఆర్‌కు అందజేశారు. భారత ఔషధ తయారీ సంస్థ రూ. 11లక్షల విరాళాన్ని అందజేసింది. శతాబ్ది టౌన్‌షిప్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, బింజ్‌ సరియ ఇస్పాత్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, ఏఐఎం ఏషియా సంస్థ బిషప్‌ డాక్టర్‌ జాబ్‌ లోహ్రా, ఎస్‌ఎ్‌సబీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలపర్స్‌ తరఫున ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి రూ.10 లక్షల చొప్పున సీఎంఆర్‌ఎఫ్‌కు విరాళం ఇచ్చారు. ఆలిండియా తెలగ కాపు బలిజ సంఘం, సినీ నటుడు ఎం.సాగర్‌, షెనాయ్‌ హాస్పిటల్‌, ఇమాన్యుల్‌ రిసార్ట్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ రూ.5లక్షల చొప్పున విరాళమివ్వగా.. తెలంగాణ పద్మశాలి సంఘం రూ.3లక్షల చెక్కును మంత్రి కేటీఆర్‌కు అందజేసింది. హైదరాబాద్‌లోని అమీర్‌పేటకు చెందిన అగర్వాల్‌ సమాజ్‌ రూ.2 లక్షలు, అమీర్‌పేట మర్చంట్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ రూ.3.50 లక్షలు, లీలానగర్‌ కాలనీ వాసులు రూ.1.30 లక్షలు, విఘ్నేశ్వర స్కిల్స్‌ ఆధ్వర్యంలో రూ.2లక్షలను సీఎంఆర్‌ఎఫ్‌కు విరాళంగా ఇచ్చారు.


సీఎం సహాయనిధికి సుజనా 50 లక్షల విరాళం

కరోనా నిర్మూలనకు రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి ఎంపీ ఫండ్స్‌ నుంచి రూ.కోటి, సుజనా ఫౌండేషన్‌ నుంచి రూ.50 లక్షలు విరాళం ప్రకటించారు. మంగళవారం ప్రగతిభవన్‌లో మంత్రి కేటీఆర్‌ను కలిసి చెక్కును అందజేశారు. ఎంపీ ఫండ్స్‌ నుంచి ఇచ్చిన  నిధుల్లో రూ. 50 లక్షలు ప్రభుత్వ ఆస్పత్రుల్లో అవసరమైన పరికరాల కొనుగోలుకు, మరో రూ.50 లక్షలు పోలీసు సిబ్బంది అవసరాలకు కేటాయించాలని కోరినట్లు సుజనా తెలిపారు. అంతే కాకుండా ఐఐటీ ముంబై అల్యుమినీ అసోసియేషన్‌, తెలంగాణ స్టేట్‌ కో-ఆపరేటివ్‌ వీవర్స్‌ సహకారంతో రూ. 10 లక్షల విలువ గల మాస్కులను ప్రభుత్వ ఆస్పత్రుల్లోని వైద్య సిబ్బందికి అందిస్తామన్నారు.

Updated Date - 2020-04-09T09:24:56+05:30 IST