Advertisement
Advertisement
Abn logo
Advertisement

రాజ్యాంగంపై విద్యార్థులకు అవగాహన అవసరం

నిర్మల్‌ కల్చరల్‌, నవంబరు 27 : భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా శనివారం జేవీనర్సింగరావు పాఠశాలలో రాజ్యాంగంపై అవగాహన కల్పించా రు. బార్‌ అసోసియేషన్‌ నిర్మల్‌ అధ్యక్షుడు ఏ. మల్లారెడ్డి మాట్లాడుతూ... చిన్ననాటి నుండి విద్యార్థులు భారతరాజ్యాంగం పట్ల అవగాహన కలిగి ఉం డాలన్నారు. రాజ్యాంగం కల్పించిన హక్కులు సద్వినియోగం చేసుకోవా లన్నా రు. ఇతరుల హక్కులకు భంగం కలిగించకుండా ఉండాలని రాజ్యాంగ నిర్మాత బీఆర్‌ అంబేద్కర్‌ రాజ్యాంగాన్ని రచించారన్నారు. రాజ్యాంగంపై గౌర వం కలిగి అన్ని వర్గాల ప్రజలు సమాన హక్కులు కలిగి అభివృద్ధి చెందేం దుకు దోహదం చేస్తుందన్నారు. విద్యార్థులకు మాదిరి ఎన్నికలు నిర్వహిం చారు. న్యాయవాదులు మధు, అరవింద్‌, ప్రిన్సిపాల్‌ నర్సింహారెడ్డి,  ఏవో రఘురాజ్‌ పాల్గొన్నారు. 

Advertisement
Advertisement