విద్యార్థులకు న్యాయ విజ్ఞానం అవసరం

ABN , First Publish Date - 2021-10-24T05:44:42+05:30 IST

విద్యార్థులకు న్యాయ విషయాలపై పరిజ్ఞానం అవసరమని సీనియర్‌ సివిల్‌ జడ్జి రమే్‌షనాయుడు అన్నారు. పెద్దారవీడు మండలం గొబ్బూరులోని ఎన్‌ఎ్‌స లా కళాశాలలో శనివారం న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ విద్యార్థులలో నేర్చుకోవాలనే ఆసక్తి పెంపొందించాలని ఇలాంటి సదస్సుల ద్వారా సబ్జెక్టులపై పట్టు పెరుగుతుందన్నారు. ప్రిన్సిపల్‌ జూనియర్‌ జడ్జి వి.ఆదినారాయణ మాట్లాడుతూ ప్రస్తుతం జరుగుతున్న నేరాలపై విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలన్నారు.

విద్యార్థులకు న్యాయ విజ్ఞానం అవసరం
అవగాహన కల్పిస్తున్న న్యాయమూర్తులు

పెద్దారవీడు, మార్కాపురం(వన్‌టౌన్‌), అక్టోబరు 23 : విద్యార్థులకు న్యాయ విషయాలపై పరిజ్ఞానం అవసరమని సీనియర్‌ సివిల్‌ జడ్జి రమే్‌షనాయుడు అన్నారు. పెద్దారవీడు మండలం గొబ్బూరులోని ఎన్‌ఎ్‌స లా కళాశాలలో శనివారం న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ విద్యార్థులలో నేర్చుకోవాలనే ఆసక్తి పెంపొందించాలని ఇలాంటి సదస్సుల ద్వారా సబ్జెక్టులపై పట్టు పెరుగుతుందన్నారు. ప్రిన్సిపల్‌ జూనియర్‌ జడ్జి వి.ఆదినారాయణ మాట్లాడుతూ ప్రస్తుతం జరుగుతున్న నేరాలపై విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలన్నారు.  కార్యక్రమంలో కళాశాల చైర్మన్‌ నాదెళ్ల చంద్రమౌళి,  సీఐ బీటీ నాయక్‌, ఎస్‌ఐ డి.రామకృష్ణ, సీనియర్‌ న్యాయవాది షేక్‌ యూసఫ్‌ అలీ తదితరులు పాల్గొన్నారు.

చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి

రాచర్ల : చట్టాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని గిద్దలూరు జూనియర్‌ సివిల్‌ జడ్జి బి.రాజేష్‌ అన్నారు. శనివారం మండలంలోని రాచర్ల, అనంపల్లి గ్రామాలలో జరిగిన సమావేశాలలో జూనియర్‌ సివిల్‌ జడ్జి రాజేష్‌ ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. కార్యక్రమాల్లో తహసీల్దార్‌  షేక్‌ ఇబ్రహీంఖలీల్‌, ఎంపీడీవో మస్తాన్‌వలి, ఎస్‌ఐ త్యాగరాజు, సర్పంచ్‌ శిరిగిరి రమేష్‌, ఎంపీటీసీ ఏలం రాజేశ్వరి, అన్నోజీరావు  పాల్గొన్నారు. 

కంభంలో..

కంభం : చట్టం, న్యాయం దృష్టిలో అందరూ సమానమని, న్యాయానికి గొప్ప, బీద అనే తేడా లేదని ప్రిన్సిపల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి బి.రాజేష్‌ తెలిపారు. తురిమెళ్ళలో శనివారం ఎస్సీపాలెంలో ఏర్పాటు చేసిన ఉచిత న్యాయ సదస్సులో జడ్జి మాట్లాడారు. అనంతరం జడ్జి రాజేష్‌ మొక్కలు నాటారు.  కార్యక్రమంలో న్యాయవాది చలపతి, పంచాయతీ కార్యదర్శి సుధాకర్‌, సర్పంచ్‌ సుభద్ర, పారాలీగల్‌ వలంటీర్‌ ఏలియా, ఆర్‌ఐ సలీమ్‌ పాల్గొన్నారు. 


Updated Date - 2021-10-24T05:44:42+05:30 IST