విద్యార్థులు విద్యాభ్యాసానికి దూరం కాకూడదు

ABN , First Publish Date - 2020-12-05T03:54:17+05:30 IST

కరోనా నేపథ్యంలో విద్యార్థులు పాఠశాలలకు దూరంగా ఉన్నా విద్యాభ్యాసానికి దూరం కాకూడదని జిల్లా విద్యా శిక్షణ సంస్థ ఉపన్యాసకులు, పాఠశాలల అకడమిక్‌ పరిశీలకుడు గొట్టేటి రవి సూచించారు.

విద్యార్థులు విద్యాభ్యాసానికి దూరం కాకూడదు
ఉపాధ్యాయులతో మాట్లాడుతున్న గొట్టేటి రవి

పాఠశాలల అకడమిక్‌ పరిశీలకుడు రవి


సబ్బవరం, డిసెంబరు 4 : కరోనా నేపథ్యంలో విద్యార్థులు పాఠశాలలకు దూరంగా ఉన్నా విద్యాభ్యాసానికి దూరం కాకూడదని జిల్లా విద్యా శిక్షణ సంస్థ ఉపన్యాసకులు, పాఠశాలల అకడమిక్‌ పరిశీలకుడు గొట్టేటి రవి సూచించారు. శుక్రవారం మండలంలోని మలునాయుడుపాలెం జడ్పీ హైస్కూల్‌, ప్రాఽథమిక పాఠశాల,  అయ్యన్నపాలెం ప్రాథమికోన్నత పాఠశాలలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన ఉపాధ్యాయుల డైరీలు, టీచింగ్‌ నోట్స్‌లు, విద్యా వారధి టీవీ పనులు పరిశీలించారు. పదో తరగతి విద్యార్థులకు పలు సూచనలు చేశారు. కొవిడ్‌లో ఉపాధ్యాయులు తీసుకుంటున్న జాగ్రత్తల గురించి తెలుసుకున్నారు. కొవిడ్‌తో పాఠశాలలకు రాని విద్యార్థులను ఫోన్‌ ద్వారా అప్రమత్తం చేసి, వర్క్‌ షీట్లు ఇచ్చి వారి అభ్యాసన మెరుగుపరచాలని సూచించారు. కార్యక్రమంలో హెచ్‌ఎం నారాయణరావు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-05T03:54:17+05:30 IST