‘డిగ్రీ కాలేజీని ఎయిడెడ్‌గా కొనసాగించాలి’

ABN , First Publish Date - 2022-01-22T05:55:45+05:30 IST

సుమారు 40 గ్రామాలకు మండలంలో ఉన్న ఏకైక డిగ్రీ కాలేజీని ప్రైవేట్‌గా కాకుండా, ఎయిడెడ్‌ కళాశాలగా నిర్వహించాలని విద్యార్థులు ఆందోళన చేశారు.

‘డిగ్రీ కాలేజీని ఎయిడెడ్‌గా కొనసాగించాలి’
వీరవాసరం బస్టాండ్‌ సెంటర్‌లో విద్యార్థుల నిరసన ప్రదర్శన

వీరవాసరం, జనవరి 21 :  సుమారు 40 గ్రామాలకు మండలంలో ఉన్న ఏకైక డిగ్రీ కాలేజీని ప్రైవేట్‌గా కాకుండా, ఎయిడెడ్‌ కళాశాలగా నిర్వహించాలని విద్యార్థులు ఆందోళన చేశారు. వీరవాసరం ఎస్‌ఎంబీటీఏవీ ఎస్‌ఎన్‌ డిగ్రీ కళాశాల విద్యార్థులు శుక్రవారం తరగతులను బహిష్కరించి బస్టాండ్‌ సెంటర్‌లో శుక్రవారం ధర్నా చేశారు. కళాశాల నుంచి బస్టాండ్‌ వరకు నినాదాలు చేశారు. కాలేజీ నుంచి వెళ్లిన ఎయిడెడ్‌ సిబ్బందిని తిరిగి రప్పించే దిశగా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వ నిర్ణయం వల్ల యాజమాన్యం సైతం ఎయిడెడ్‌ సిబ్బందిని వదిలి ప్రైవేటుగా కొనసాగించడానికి ప్రాధాన్యత ఇవ్వడం గ్రామీణ ప్రాంత విద్యాభివృద్ధిని, దాత లక్ష్యానికి విఘాతం కల్గించడమేనన్నారు. ప్రైవేటు ఫీజుల భారం భరించలేక విద్యార్థులు విద్యకు దూరమయ్యే పరిస్థితులు కల్పించవద్దంటూ పేర్కొన్నారు. 

Updated Date - 2022-01-22T05:55:45+05:30 IST