Advertisement
Advertisement
Abn logo
Advertisement

విద్యార్థులు క్రీడల్లోనూ రాణించాలి

 ఎంజీయూ వైస్‌ ఛాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ గోపాల్‌రెడ్డి

 భువనగిరిలో బాస్కెట్‌బాల్‌ మీట్‌ ప్రారంభం

భువనగిరిటౌన్‌, డిసెంబరు 3: విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలని మహాత్మా గాంధీ యూనివర్సిటీ వైస్‌ ఛాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ సీహెచ్‌ గోపాల్‌రెడ్డి అన్నారు. భువనగిరి ఎస్‌ఎల్‌ఎన్‌ఎ్‌స డిగ్రీ కళాశాలలో నిర్వహించిన ఎంజీయూ అంతర్‌ కళాశాలల బాస్కెట్‌ బాల్‌ మీట్‌ను శుక్రవారం ప్రారంభించి మాట్లాడారు. విద్యార్థులు కేవలం చదువులకే పరిమితం కావద్దని, భవిష్యత్‌లో స్థిరపడేందుకు ఉపకరించే అన్నిరంగాల్లో నైపుణ్యం సాధించేందుకు విద్యార్థిదశలోనే శ్రద్ధచూపాలన్నారు. ఈమేరకు యూనివర్సిటీ కూడా విద్యార్థులను ప్రోత్సహిస్తుందన్నారు. యూనివర్సిటీ క్రీడాబోర్డు కార్యదర్శి ఉపేందర్‌రెడ్డి మాట్లాడుతూ యూనివర్సిటీ పరిధిలో మెరుగైన క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నట్లు తెలిపారు. 10పురుషుల జట్లు, 10 మహిళల జట్లు పాల్గొనే ఈమీట్‌లో యూనివర్సిటీ జట్లను ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. ఎంపికైన జట్లు త్వరలో పంజాబ్‌లో జరిగే యూనివర్సిటీ మీట్‌లో ఎంజీయూకు ప్రాతినిఽథ్యం వహిస్తారన్నారు. కార్యక్రమంలో ఎంజీయూ పాలక మండలి సభ్యుడు డాక్టర్‌ బి.సూర్యనారాయణరెడ్డి, కళాశాల కార్యదర్శి రావి సుకేష్‌రెడ్డి, ప్రిన్సిపల్‌ డాక్టర్‌ ఎన్‌.శ్రీనివాస్‌, పీడీ జి.పాండురంగం, మునిసిపల్‌ చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ ఆంజనేయులు, కిష్టయ్య పాల్గొన్నారు. అనంతరం భువనగిరిలోని జాగృతి డిగ్రీ, పీజీ కళాశాలను వైస్‌ ఛాన్స్‌లర్‌ సందర్శించి ల్యాబ్‌లను తనిఖీచేశారు. 

Advertisement
Advertisement