విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో చదవాలి

ABN , First Publish Date - 2021-10-23T05:28:40+05:30 IST

కొవిడ్‌ మహమ్మారి నుంచి ఇప్పుడిప్పుడే బయట పడుతున్న నేపథ్యంలో విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో చదవాలని రామగుండం ఎన్టీపీ సీ సీజీఎం సునీల్‌ కుమార్‌ అన్నారు.

విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో చదవాలి
ప్రసంగిస్తున్న ఎన్టీపీసీ సీజీఎం సునీల్‌ కుమార్‌

- ఎన్టీపీసీ సీజీఎం సునీల్‌ కుమార్‌

జ్యోతినగర్‌, అక్టోబరు 22 : కొవిడ్‌ మహమ్మారి నుంచి ఇప్పుడిప్పుడే బయట పడుతున్న నేపథ్యంలో విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో చదవాలని రామగుండం ఎన్టీపీ సీ సీజీఎం సునీల్‌ కుమార్‌ అన్నారు. శుక్రవారం ఎన్టీపీసీలోని సచ్‌దేవ పాఠశాలలో జరిగిన మోటివేషన్‌ కార్యక్రమంలో సీజీఎం విద్యార్థులనుద్దేశించి ప్రసంగించారు. కొవిడ్‌ వల్ల అన్ని వర్గాల ప్రజలతోపాటు విద్యార్థులు తీవ్రమైన ఇబ్బందులు పడ్డార న్నారు. రెండు విద్యా సంవత్సరాలలో విద్యా బోధనకు అవాంతరం ఏర్పడిందన్నారు. ఇలాంటి క్లిష్టమైన సమయంలో విద్యార్థులకు సరైన రీతిలో మార్గదర్శనం చేయా ల్సిన బాధ్యత ఉపాధ్యాయలపై ఉందన్నారు. ప్రస్తుతం కాలంలో ప్రతి విద్యార్థి చురు కైన వారేనని, వారిని సరైన మార్గంలో నడిపించాల్సిన బాధ్యత గురవులపై ఉంద న్నారు. కాగా, విద్యార్థులు క్రమశిక్షణతో చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని సీజీఎం ఆకాంక్షించారు. కార్యక్రమంలో సచ్‌దేవ స్కూల్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ ప్రిన్సిపాల్‌ జ్ఞాన్‌చంద్‌, ఎన్టీపీసీ అధికారులు కె.కార్తికేయన్‌, డీఎస్‌.కుమార్‌, కెవిఎంకె.శ్రీనివాస్‌, విద్యార్థులు, ఉపాధ్యాయులు  పాల్గొన్నారు. 

Updated Date - 2021-10-23T05:28:40+05:30 IST