Abn logo
Sep 26 2021 @ 00:36AM

విద్యార్థులు లక్ష్య సాధనకు కృషి చేయాలి

సమావేశంలో మాట్లాడుతున్న జడ్జి పార్థసారధిరావు

- జడ్జి  పార్థసారధిరావు

సుల్తానాబాద్‌, సెప్టెంబరు 25: విద్యార్థులు లక్ష్య సాధనకు నిరంతరం కృషి చేయాలని సుల్తానాబాద్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి పార్థసారధిరావు అన్నారు. మండ లంలోని గర్రెపల్లి మోడల్‌ స్కూల్‌లో శనివారం ఏర్పాటు చేసిన న్యాయ విజ్జాన సదస్సులో జడ్జి మాట్లాడారు. ఉన్నతమైన లక్ష్యాన్ని ఎంచుకుని దాన్ని సాధించుకో వాలనే తపన కలిగి ఉండాలని, తద్వారా ఉన్నత భవిష్యత్తు కలుగుతుందన్నారు. జనరల్‌ నాలెడ్జ్‌కు సంబంధించిన క్విజ్‌ పోటీ నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు వొడ్నాల రవీంద ర్‌, కార్యదర్శి నేరళ్ళ శంకరయ్య, మోడల్‌ స్కూల్‌ ప్రిన్సిపాల్‌ నీలకంఠం రాంబాబు, వైస్‌ప్రిన్సిపాల్‌ రఘునాథ్‌, భిక్షం, న్యాయవాదులు జోగుల రమేష్‌, సరోత్తంరెడ్డి, ప డాల శ్రీరాములు, సత్యనారాయణ, సామల రాజేంద్రప్రసాద్‌, నర్సయ్య, యుగం దర్‌ తదితరులు పాల్గొన్నారు.