విద్యార్థులు శ్రద్ధగా చదివి ఉత్తమ ఫలితాలు సాధించాలి

ABN , First Publish Date - 2021-03-03T05:36:10+05:30 IST

పరీక్షల సమయం దగ్గర పడుతున్నందున విద్యార్థులు శ్రద్ధగా చదివి ఉత్తమ ఫలితాలు సాధించాలని డీఈవో రవీందర్‌రెడ్డి అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాలను తనిఖీ చేశారు. పదవ తరగతి విద్యార్థులను ఇప్పటి వరకు జరిగిన పాఠాల గురించి అడిగి తెలుసుకున్నారు.

విద్యార్థులు శ్రద్ధగా చదివి ఉత్తమ ఫలితాలు సాధించాలి
ఆదిలాబాద్‌లోని జడ్పీ సెకండరీ పాఠశాల విద్యార్థులతో మాట్లాడుతున్న డీఈవో

నార్నూర్‌, మార్చి 2: పరీక్షల సమయం దగ్గర పడుతున్నందున విద్యార్థులు శ్రద్ధగా చదివి ఉత్తమ ఫలితాలు సాధించాలని డీఈవో రవీందర్‌రెడ్డి అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాలను తనిఖీ చేశారు. పదవ తరగతి విద్యార్థులను ఇప్పటి వరకు జరిగిన పాఠాల గురించి అడిగి తెలుసుకున్నారు. మధ్యాహ్నా భోజనం, వంట గదిని పరిశీలించారు. పాఠశాల రికార్డులను పరిశీలించి ఉపాధ్యాయుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. కరోనా వైరస్‌ పట్ల జాగ్రత్తలు పాటించాలని ఆదేశించారు. ఆయన వెంట ప్రధానోపాధ్యాయుడు చిన్నప్పరెడ్డి, ఉపాధ్యాయులు ఉన్నారు.  

ఆదిలాబాద్‌రూరల్‌: పట్టణంలోని జడ్పీ సెకండరీ పాఠశాలను మంగ ళవారం డీఈవో రవీందర్‌రెడ్డి సందర్శించారు. ముఖ్యంగా పదవ తరగతి విద్యార్థు లు 95శాతం హాజరుకావడంపై సంతోషం వ్యక్తం చేశారు. పదవ తరగతి వార్షిక పరీక్షల కోసం ఏ విధంగా చదివితే అత్యధిక జీపీఏ సాధించవచ్చు వివరించడం జరిగింది. రిలయన్స్‌ సంస్థ వారు డీఈవో చేతుల మీదుగా జడ్పీ సెకండరీ పాఠశాల యాపల్‌ గూడ విద్యార్థులకు మాస్క్‌లను అందజేశారు. కార్యక్రమంలో హెచ్‌ఎం మహమ్మద్‌ ముజఫర్‌ హుసేన్‌, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

ఆదిలాబాద్‌టౌన్‌: ఇప్పటి వరకు 6,7,8, 9,10 తరగతులకు విద్యార్థులు హాజరవుతున్నందున సదరు ఉపాధ్యాయులు సైతం పాఠశాలకు వస్తున్నారని ఈనెల 3వ తేదీ నుంచి జిల్లా వ్యాప్తంగా ప్రాథమిక పాఠశాలల్లో విద్యాబోధన చేస్తున్న ఉపాధ్యాయులు కూడా ప్రతి రోజూ పాఠశాలకు హాజరు కావాలని డీఈ వో రవీందర్‌రెడ్డి తెలిపారు. ఈ మేరకు ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వచ్చినట్లు పేర్కొన్నారు. ఉపాధ్యాయుల సేవలను వినియోగించుకోవాలని మండల విద్యాధి కారులు వర్క్‌ అడ్జస్ట్‌మెంట్‌ చేయాలని డీఈవో సూచించారు.

Updated Date - 2021-03-03T05:36:10+05:30 IST