Advertisement
Advertisement
Abn logo
Advertisement

విద్యాలయాల్లో సమస్యలపై కదం తొక్కిన విద్యార్థులు


హుకుంపేట, డిసెంబర్‌ 6: మండల కేంద్రంలోని విద్యాలయాల్లో సమస్యలను పరిష్కరించాలనే డిమాండ్‌ చేస్తూ జూనియర్‌ కళాశాల, ప్రభుత్వ ఉన్నత పాఠశాల, ఆశ్రమ పాఠశాలకు విద్యార్థులు సోమవారం ఆందోళన నిర్వహించారు. జూనియర్‌ కళాశాల నుంచి ఎంపీడీవో కార్యాలయం వరకు విద్యార్థులు ర్యాలీగా వచ్చి ధర్నా చేపట్టారు. ప్రభుత్వ ఉన్నత, ఆశ్రమ పాఠశాలల్లో సమస్యలు పరిష్కరించాలని, 500 మంది పైబడి విద్యార్థులున్న ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో తాగేందుకు నీరు కూడా లేదని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యాలయాల్లో సమస్యలను అధికారులు పరిష్కరించాలని లేకుంటే ఆందోళన తీవ్రం చేస్తామని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి ప్రభుదాస్‌ హెచ్చరించారు. తమ సమస్యలపై ఎంఈవో ఎస్‌.రామచంద్రరావుకు వినతిపత్రం సమర్పించారు. ఈఆందోళనలో గిరిజన సంఘం నేత టి.కృష్ణారావు, ఎస్‌ఎఫ్‌ఐ నేతలు చిన్నారావు, పాపారావు, జీవన్‌, కృష్ణ, కార్తీక్‌ పాల్గొన్నారు.


 

Advertisement
Advertisement