Abn logo
Aug 5 2020 @ 02:29AM

కరోనాలో జన్యుమార్పులు తగ్గుముఖం

  • ఇటలీ శాస్త్రవేత్తల అధ్యయనంలో వెల్లడి 

న్యూఢిల్లీ, ఆగస్టు 4 : కొవిడ్‌ వ్యాక్సిన్‌ కోసం అహర్నిశలు శ్రమిస్తున్న శాస్త్ర ప్రపంచానికి శుభవార్త ఇది. కరోనా వైర్‌సలో జన్యుమార్పులు తగ్గుముఖం పట్టాయని ఇటలీలోని బోలోగ్నా వర్సిటీ శాస్త్రవేత్తల అధ్యయనంలో వెల్లడైంది. వివిధ దేశాల నుంచి సేకరించిన 48,635 వైరస్‌ జన్యువుల విశ్లేషణ అనంతరం ఈ నిర్ధారణకు వచ్చినట్లు వారు తెలిపారు. గత అధ్యయనాల్లో కరోనా వైర్‌సలో ఆరు జన్యుమార్పులు జరిగాయని గుర్తించగా, తాజాగా ఆ సంఖ్య అతిస్వల్పంగా పెరిగి ఏడుకు చేరినట్లు గుర్తించారు.  

Advertisement
Advertisement
Advertisement