Advertisement
Advertisement
Abn logo
Advertisement

మలేషియా వర్సిటీతో ఎస్వీయూ ఒప్పందం

తిరుపతి(విశ్వవిద్యాలయాలు), డిసెంబరు 5: పరిశోధనల్లో పరస్పరం సహకరించుకునేందుకు మలేషియా యూనివర్సిటీతో ఎస్వీయూ అవగాహనా ఒప్పందం కుదుర్చుకుంది. ఇందుకు సంబంధించిన ఒప్పంద పత్రాలపై రెండు వర్సిటీల ప్రతినిధులు సంతకాలు చేశారు. ఈ సందర్భంగా మలేషియా వర్సిటీ ప్రతినిధి ప్రొఫెసర్‌ మహమ్మద్‌ అరీఫుల్లా మాట్లాడుతూ.. ఎస్వీయూలో శిక్షణ కార్యక్రమాలు, వర్క్‌షా్‌పలు, పరిశోధనా ప్రాజెక్టుల నిర్వహణకు తాము తోడ్పాటు అందిస్తామన్నారు. మలేషియా వర్సిటీలో ఇంటెర్నషిప్‌ కోసం ఎస్వీయూ విద్యార్థులు రావచ్చన్నారు. వీసీ రాజారెడ్డి మాట్లాడుతూ.. ఎస్వీయూలో పరిశోధనా అభివృద్ధికి మలేషియా వర్సిటీ సహకారాన్ని వినియోగించుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో రెక్టార్‌ శ్రీకాంత్‌రెడ్డి, రిజిస్ట్రార్‌ హుస్సేన్‌, పాలకమండలి సభ్యులు ప్రొఫెసర్‌ పరమగీతం, డాక్టర్‌ భాస్కరరెడ్డి, డాక్టర్‌ మాధవి, హనుమంతరావు, డీన్‌ కిషోర్‌, డాక్టర్‌ దామోదరం తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement