Advertisement
Advertisement
Abn logo
Advertisement
Mar 4 2021 @ 19:21PM

అసెంబ్లీ ఎదుట ఎస్‌ఐ ఆత్మహత్య.. సీఎం పేరున సూసైడ్ నోట్

లక్నో: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ వద్ద దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ పోలీసు సబ్ ఇన్‌స్పెక్టర్ తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన ప్రస్తుతం యూపీ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. యూపీ అసెంబ్లీ గేట్ నంబరు 7 వద్ద సబ్ ఇన్‌స్పెక్టర్ నిర్మల్ కుమార్ చౌబే తన తుపాకీతో తానే కాల్చుకున్నారు. దీంతో ఆయన అక్కడికక్కడే మరణించారు. ఆత్మహత్య అనంతరం ఆయన  మృతదేహం వద్ద నుంచి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కోసం రాసిన ఓ లెటర్ ఉంది. ఆ లెటర్లో ‘నా మనసేమీ బాలేదు. నేను వెళ్లిపోతున్నాను. నా పిల్లల బాగోగులు చూడండి’ అని రాశారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని జాయింట్ కమిషనర్ నవీన్ అరోరా తెలిపారు.


Advertisement
Advertisement