ఘనంగా నేతాజీ జయంతి

ABN , First Publish Date - 2022-01-24T05:54:26+05:30 IST

జాతీయోద్యమ నాయకుడు నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ వర్థంతి సభలు ఆదివారం జిల్లా వ్యాప్తంగా జరిగాయి.

ఘనంగా నేతాజీ జయంతి
కర్నూలు ప్రభుత్వ ఒకేషనల్‌ జూనియర్‌ కళాశాలలో వేడుకలు

కర్నూలు(ఎడ్యుకేషన్‌), జనవరి 23: జాతీయోద్యమ నాయకుడు నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ వర్థంతి సభలు ఆదివారం జిల్లా వ్యాప్తంగా జరిగాయి. ఆయన స్ఫూర్తితో యువత సామాజిక రాజకీయ రంగాల్లో కృషి చేయాలని వక్తలు పిలుపు ఇచ్చారు. ఇందులో భాగంగా నగరంలోని బీ.క్యాంపు ప్రభుత్వ ఒకేషనల్‌ జూనియర్‌ కళాశాలలో నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ జయంతి చిత్రపటానికి ప్రిన్సిపాల్‌ నాగస్వామి నాయక్‌, అధ్యాపకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎన్‌ఎస్‌ఎస్‌ ప్రోగ్రాం ఆఫీసర్‌ ఎన్‌. విజయశేఖర్‌, నాగరాజు, వరలక్ష్మి, పార్థసారఽథి, పటేల్‌, సోమేష్‌, రోహిణీ తదితరులు పాల్గొన్నారు.


కర్నూలు(న్యూసిటీ): నేతాజీ సుభాష్‌ చంద్రబోసు ఆశయాలను కొనసాగించాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రజా పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు కే.బలరాం అన్నారు. ఆదివారం చంద్రబోసు జయంతిని పురస్కరించుకుని సమితి కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రక్ష హాస్పెటల్‌ ఎండి నాగరాజు, గొర్రెల సంఘం మాజీ అధ్యక్షుడు శ్రీనివాసరావు, పద్మానందయోగి, డేవిడ్‌, శివమణి, పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు.


 సుభాష్‌చంద్రబోసు ఆశయాలను యువత ముందుకు తీసుకెళ్లాలని రాయలసీమ మహిళా సంఘ్‌ వ్యవస్థాపక అధ్యక్షురాలు గోరంట్ల శకుంతల అన్నారు. చంద్రబోసు జయంతిని పురస్కరించుకుని అశోక్‌నగర్‌లోని పట్టణ నిరాశ్రయుల వసతి గృహంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. 


ఆదోని టౌన్‌: స్వాతంత్య్ర సమరయోధుడు సుభాష్‌చంద్రబోసు 125వ జయంతి సందర్భంగా బీజేవైఎం పట్టణ అధ్యక్షుడు అంజయ్‌కుమార్‌ అధ్యక్షతన ఆదివారం బీజేపీ కార్యాలయంలో నాయకులు, కార్యకర్తలు ఆయనకు నివాళులర్పించారు. బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కునిగిరి నీలకంఠ మాట్లాడుతూ స్వాతంత్ర సమరంలో తన స్వంత పంథాను ప్రదర్శించిన చంద్రబోస్‌ చరిత్ర భావితరాలకు తెలియ చేయాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. 


ఆదోని(అగ్రికల్చర్‌): నేతాజీ సుభాష్‌చంద్రబోసు 125వ జయంతి, పరాక్రమ దివాస్‌ను పురష్కరించుకుని ఆదివారం నేతాజీ శోభాయాత్ర నిర్వహించారు. ఆజాతి అమృత ఉత్సవాల నగర ఆ సంయోజక నాగరాజు ఆధ్వర్యంలో పట్టణ పురవీధుల్లో 75 జాతీయ పతకాలతో తిరంగ యాత్ర చేపట్టారు. ఏబీఆర్‌ఎస్‌ఎం జాతీయ సహాయ కార్యదర్శి రాజశేఖర్‌రావు, న్యాయవాది లోకేష్‌, ఆపాస్‌ నాయకులు ఎంపీ శ్రీనివాసులు, జ్ఞానేశ్వర్‌రావు, శ్రీధర్‌, నాగరాజు, విశ్వనాథ్‌, సాయిప్రసాద్‌ పాల్గొన్నారు. 


  గ్రంథాలయంలో నేతాజీ సుభాష్‌చంద్రబోసు జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి లైబ్రెరియన్‌ పెద్దక్క పూలమాల వేసి నివాళి అర్పించారు. 


డోన్‌(రూరల్‌): పట్టణంలో పెన్షనర్ల సంఘం కార్యాలయంలో నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. నేతాజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పెన్షనర్ల సంఘం నాయకులు కేఎన్‌ భానుసింగ్‌, గాలయ్య, గోపాల్‌, శేఖరయ్య, రామదాసు రెడ్డి పాల్గొన్నారు. అలాగే పట్టణంలోని పాతపేట జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో యుటీఎఫ్‌ ఆధ్వర్యంలో నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ జయంతి వేడుకలు నిర్వహించారు. 

Updated Date - 2022-01-24T05:54:26+05:30 IST