యువతకు ఆదర్శం సుభాష్‌ చంద్రబోస్‌

ABN , First Publish Date - 2022-01-24T06:06:27+05:30 IST

భారత జాతీయ స్వాతంత్ర్యోద్యమంలో ప్రముఖుడు నేతాజీ సుబాస్‌ చంద్రబోస్‌ యువతకు ఆదర్శమని కిసాన్‌ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు తాండ్ర శేషుబాబు అన్నారు.

యువతకు ఆదర్శం సుభాష్‌ చంద్రబోస్‌
ద్వారకాతిరుమల మండలం పంగిడిగూడెంలో చంద్రబోస్‌కు నివాళి

ద్వారకాతిరుమల, జనవరి 23: భారత జాతీయ స్వాతంత్ర్యోద్యమంలో ప్రముఖుడు నేతాజీ సుబాస్‌ చంద్రబోస్‌ యువతకు ఆదర్శమని కిసాన్‌ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు తాండ్ర శేషుబాబు అన్నారు. పంగిడిగూడెం లో నేతాజీ జయంతి వేడుకలు బీజేపీ నేతలు ఘనంగా నిర్వహించారు. నేతాజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో గణపతి, బి.నరసింహారావు, వీరాస్వామి, నాగు, వెంకటకృష్ణ, ఏసేపురెడికడ శ్రీనివాస్‌, జయ తదిత రులు పాల్గొన్నారు.


చింతలపూడి: స్థానిక బోసుబొమ్మ సెంటర్‌లో సుభాష్‌ చంద్రబోస్‌ జయంతి కార్యక్రమం అమ్మ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో జరిగింది. జానకీరెడ్డి కేక్‌ కట్‌ చేసి అభిమానులకు అందచేశారు. ఫౌండేషన్‌ సభ్యుడు కన్నబాబు, ఆర్నేపల్లి అప్పారావు, గంధం చంటి, పాకా సర్వేశ్వరరావు, మాదాసు పుల్లారావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-01-24T06:06:27+05:30 IST