దేశభక్తికి నిలువెత్తు రూపం సుభాష్‌చంద్రబోస్‌

ABN , First Publish Date - 2022-01-24T04:32:17+05:30 IST

దేశభక్తికి నిలువెత్తు రూపం సుభాష్‌ చంద్రబోస్‌ అని నంద్యాల వన్‌టౌన్‌ ఎస్‌ఐ దేవేంద్రకుమార్‌, ఆల్‌ మదద్‌ ఫౌండేషన్‌ ఛైర్మన్‌ ఆకుమల్ల రహీమ్‌ అన్నారు.

దేశభక్తికి నిలువెత్తు రూపం సుభాష్‌చంద్రబోస్‌
ఆళ్లగడ్డలో నేతాజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పిస్తున్న అమీర్‌బాషా

నంద్యాల టౌన్‌, జనవరి 23: దేశభక్తికి నిలువెత్తు రూపం సుభాష్‌ చంద్రబోస్‌ అని నంద్యాల వన్‌టౌన్‌ ఎస్‌ఐ దేవేంద్రకుమార్‌, ఆల్‌ మదద్‌ ఫౌండేషన్‌ ఛైర్మన్‌ ఆకుమల్ల రహీమ్‌ అన్నారు. ఆదివారం పార్కు రోడ్డులో చిన్న వ్యాపారుల సంక్షేమ సంఘం కార్యాలయంలో సుభాష్‌ యూత్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు మస్తాన్‌వలి అధ్యక్షతన నేతాజీ 125వ జయంతి నిర్వహించారు. ముఖ్య అతిథులుగా పాల్గొన్న దేవేంద్రకుమార్‌, రహీమ్‌ మాట్లాడుతూ భారత్‌కు ఆయుధాలతో పోరాడడం తెలుసునని ప్రపంచానికి చాటి చెప్పిన మహోన్నతుడు నేతాజీ అని అన్నారు. స్వాతంత్య్ర పోరాటం అహింస మార్గంలోనే కాదు, వీర మార్గంలోనూ పోరాడదామని పిలుపునిచ్చిన మహావీరుడు బోస్‌ అన్నారు. తానే స్వయంగా ఆజాద్‌ హింద్‌ పౌజ్‌ సైన్యా న్ని తయారు చేసి, ఆంగ్లేయులపై దేశ స్వాతంత్య్రం కోసం తిరుగుబాటు చేసి స్వాతంత్య్రం రావడం కోసం తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోరాటం చేసిన మహావీరుడని అన్నారు. కార్యక్రమంలో మదర్‌ యూత్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు మురళి, చిన్న వ్యాపారుల సంఘం అధ్యక్షుడు సత్యనారాయణ, ప్రజాస్వామ్య పరిరక్ష ణ ఐక్యవేదిక పట్టణ అధ్యక్షుడు గులాం పాల్గొన్నారు. 

- నంద్యాల పట్టణంలోని పద్మావతినగర్‌లో గ్రంథాలయంలో గ్రంథాలయ శాఖాధికారి బషీర్‌ అహమ్మద్‌ ఆధ్వర్యంలో నేతాజీ సుభాష్‌చంద్రబోస్‌ 125వ జయంతిని నిర్వ హించారు. ముఖ్య అతిథులుగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థి, యువజన సంఘం జిల్లా వర్కింగ్‌ ప్రసిడెంట్‌ షేక్‌ రియాజ్‌, ప్రముఖ సాహితివేత్త అన్నెం శ్రీనివాసరెడ్డి పాల్గొ న్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సుభాష్‌ చంద్రబోస్‌ ప్రతిష్టాత్మకమైన ఇండియన్‌ సివిల్‌ సర్వీస్‌ నుంచి వైదొలిగి భారత స్వాతంత్య్ర సంగ్రామంలో పాల్గొన్నారని అన్నారు. భారత జాతీయ కాంగ్రెస్‌ పార్టీ రెండుసార్లు అధ్యక్షుడిగా ఎన్నికయ్యారని అన్నారు. ఒకవైపు మహాత్మా గాంధీ అహింస వాదంతో స్వరాజ్యం సిద్ధిస్తుందని పోరాటం సాగిస్తే, సుభాష్‌ చంద్రబోస్‌ మాత్రం సాయుధ పోరాటం ద్వారా దేశం నుంచి ఆంగ్లేయులను తరిమికొట్టవ చ్చని నమ్మి ఆచరణలో పెట్టారని, ఆల్‌ ఇండియా ఫార్వర్డ్‌ బ్లాక్‌ పార్టీని స్థాపించారని అన్నారు. నేతాజీ ఆశయ సాధనకు యువత పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత శేషఫణి, రేగడ గూడూరు ప్రధానోపాధ్యాయుడు రసూల్‌ ఖాన్‌, కవి నీలకంఠమాచారి తదితరులు పాల్గొన్నారు. 

ఆళ్లగడ్డ: యువతకు నేతాజీ సుబాష్‌ చంద్రబోస్‌ ఆదర్శమని మానవత సంస్థ కార్యదర్శి అమీర్‌బాషా అన్నా రు. పట్టణంలోని బీసీ వసతి గృహం నుంచి విద్యార్థులతో నాల్గు రోడ్ల కూడలి వరకు ఆదివారం ర్యాలీ నిర్వహించి, అక్కడ నేతాజీ జయంతిని పురస్కరించుకొని చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. 

చాగలమర్రి: భారత స్వాతంత్ర సమరయోధుడు నేతా జీ సుభాష్‌చంద్రబోస్‌ ఆశయాలు చిరస్మరణీయమని సీమా ంధ్ర జిల్లా బీసీ సంక్షేమ సంఘ జిల్లా అధ్యక్షుడు సల్లా నాగరాజు, హమాలీ యూనియన్‌ అధ్యక్షుడు నరసింహులు, టీడీపీ నాయకుడు రఫిద్దీన్‌ తెలిపారు. ఆదివారం చాగల మర్రి బీసీ కార్యాలయంలో నేతాజీ సుభాష్‌చంద్రబోస్‌ 125వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూల మాల వేసి నివాళులర్పించారు. ఆయన సేవల గురించి కొనియాడారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు భాస్కర్‌ రెడ్డి, శ్యాబా, బషీర్‌, కింగ్‌హుసేన్‌, జెట్టి నాగరాజు, చోటు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.

దొర్నిపాడు: సుభాష్‌ చంద్రబోస్‌ ఆదర్శ ప్రాయుడని హాస్టల్‌ వార్డెన్‌ చంద్రశేఖర్‌రెడ్డి, గ్రంథాలయాధికారి బెల్తాజా ర్‌ తెలిపారు. ఈ సందర్భంగా వారు నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ 125వ జయంతి సందర్భంగా ఆదివారం ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళి అర్పించా రు. ఆయన సేవల గురించి కొనియాడారు. 

Updated Date - 2022-01-24T04:32:17+05:30 IST